షాకింగ్: ఆత్మలు, దెయ్యాలు.. నిజంగా ఉన్నాయా!? ఇదిగో ప్రూఫ్...

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: ఆత్మలు ఉన్నాయా? దయ్యాలు, భూతాలు నిజమేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరికి తోచినట్లు వారు చెబుతారు. కచ్చితమైన సమాధానాలు మాత్రం ఎవరి వద్దా ఉండవు.

అయితే మన సందేహాలు అర్థమయ్యాయో ఏమో తెలియదుగానీ.. అప్పుడప్పుడూ.. 'మేం మీకు కనిపించకపోయినా ఉన్నాం.. ఇదిగో అందుకు నిదర్శనం..' అంటూ ఆత్మలే చెబుతాయి. ఈ ఘటన కూడా అలాంటిదే.

ghosts

ఇంగ్లాండ్‌లోని ప్రఖ్యాత కాంటెర్బరీ నగరం. అందులో టేలర్స్‌ క్లిన్‌ అనే పబ్‌ తెలియని వారుండరు. పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా.. జనం అక్కడ సమయాన్ని గడిపేస్తారు. ఎప్పటిలానే రాత్రి బాగా పొద్దుపోయాక పబ్‌నుంచి జనం వెళ్లిపోయాక.. ఆ పబ్ సిబ్బంది కూడా తాళాలు వేసి ఇంటికెళ్లారు.

తాము ఇంటికెళ్లే సమయంలో పబ్ లోని కిటికీలు, లైట్లు, ఫ్యాన్లు, ఇలా అన్నింటిని జాగ్రత్తగా ఆఫ్ చేసి వెళ్లారు. అయితే ఉదయాన్నే మళ్లీ పబ్‌ తెరిచేసరికి కిటికీలు తెరిచిఉండడం, కొన్ని గదుల్లో ఫ్యాన్లు, లైట్లు వేసి ఉండడాన్ని పబ్‌ యజమాని ఆలిస్టర్‌ కొలిన్స్‌ గుర్తించారు.

దీంతో ఆయన సిబ్బందిపై కేకలేశారు. సిబ్బందేమో తాము చాలా జాగ్రత్తగా అన్ని ఆఫ్‌ చేశామని.. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని చెప్పారు. ఆగస్టు 4 నుంచి దాదాపు ప్రతిరోజూ పబ్ లో ఇలాగే జరుగుతోందని సిబ్బంది యజమానికి చెప్పారు.

దీంతో విషయం ఏమిటో తెలుసుకుందామని.. ఆయన సీసీటీవీ ఫుటేజ్‌ తెప్పించారు. అది చూడగానే ఆలిస్టర్‌తో పాటు సిబ్బందికి కాళ్లు, చేతులు వణికిపోయాయి.

రాత్రి పబ్ మూసేసి అందరూ ఇంటికి వెళ్లిపోయాక.. పబ్ లోని కుర్చీలు వాటంతట అవే కదిలేవి. కిటికీలు, లైట్లు, ఫ్యాన్లు ఇలా అన్నింటినీ ఎవరో తెరిచేవారు. సోపాల్లో విలాసవంతంగా కూర్చున్న ఆనవాళ్లు.. మద్యం తాగుతున్నట్లుగా కనిపించే దృశ్యాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి.

ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ.. కంటికి కనిపించని శక్తులు ఏవో నా పబ్‌లో ఉన్నాయంటూ ఆలిస్టర్‌ భయపడ్డారు. సీసీ టీవీ వీడియోను ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, అది ఇప్పుడు ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Shocking cctv footage from a “haunted pub” appears to show chairs and doors moving on their own in the middle of the night. The video filmed at Tyler’s Kiln pub, in Canterbury, Kent, has been labelled possible proof of poltergeist activity after the bizarre scenes were viewed.Staff at the pub had previously reported shadows passing doors, glasses flying off shelves, and lights mysteriously turning on. In the new video, caught by motion sensors, first a chair in the beer garden is seen moving a significant distance back and forwards. Then, inside the pub, a door slams shut, when no one was apparently there, and a smaller saloon door is also seen opening and closing. The baffling footage went viral after pub boss Allister Collins posted it online, Dailystar.co.uk reports.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి