VIRAL VIDEO:ఐస్ క్రీమ్ పట్టుకొని ఆటలు, టర్కీ సెల్లర్‌పై కోపంగా చూసిన చిన్నారి.. వైరల్

చిన్న పిల్లలకు చాక్లెట్స్, ఐస్‌క్రీమ్ అంటే ఇష్టం. వాటితో ఆడితే అంతే.. అవును చాక్లెట్, ఐస్ క్రీమ్ పేరుతో గేమ్స్ ఆడితే అంతే సంగతులు. అలా ఓ ఐస్ క్రీమ్ సెల్లార్ బేబీతో ఆడాడు. ఇంకేముంది.. ఆమె చూపు చూడటంతో వెనక్కి తగ్గాడు. కొద్దీ సేపు ఆడినా.. తర్వాత మాత్రం తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది.

టర్కీష్ ఐస్ క్రీమ్ అమ్మేవారు ఈజీగా ఇవ్వరు. కస్టమర్ చికాకు పడేవరకు అలానే చేస్తారు. అలా పిల్లలను ఏడిపిస్తారు. అలా ఒక చిన్నారి ఐస్ క్రీమ్ కోసం వచ్చింది. ఆమెకు అతను ఐస్ క్రీమ్ ఇవ్వలేదు. తొలుత టిష్యూ ఇచ్చాడు. తర్వాత కూడా అటు, ఇటు తిప్పాడు. దీంతో ఆమె కోపంగా చూసింది. ఇక లాభం లేదని అనుకున్నాడు.. వెంటనే ఆమెకు ఐస్ క్రీమ్ ఇచ్చేశాడు. ఆమె తీసుకొని.. అక్కడినుంచి వెళ్లిపోయింది.

WATCH:Girl Gives Death Stare To Turkish Ice Cream Seller

వీడియోను ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 2.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 126 కే లైకులు వచ్చాయి. చాలా మంది ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. చిన్నారి చూపునకు అతను భయపడ్డారని రాశారు. అతను ఇతరులతో ఇక ఆటలు ఆడాడు అని రాశారు. ఓ కిల్లర్ వాస్ బర్న్ అని మరొకరు రాశారు.

ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నిజమే పాపం.. ఆమె ఐస్ క్రీమ్ తినాలని అనుకుంది. అందుకోసమే ఆశగా వచ్చింది. కానీ ఇంతలోనే.. అతను అలా చేయడంతో చిరాకు వచ్చింది. కోపంగా చూడటంతో అతను ఐస్ క్రీమ్ ఇచ్చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+