వీడియో వైరల్ : ఈ 77ఏళ్ల తాతయ్య దొంగకు చుక్కలు చూపించాడు..ఫిదా అయిన నెటిజెన్లు
అసలే కలికాలం ఎటు చూసినా దొంగలే.. దొంగతనాలే. గతంలో ఓ వృద్ధ దంపతులను దోచుకునేందుకు వచ్చిన దొంగలపై వారు ఎలా తిరగబడ్డారో చూశాం. ఆ ఘటన మనదేశంలో జరిగితే తాజాగా మరో వృద్ధుడు ఓ దొంగను తరిమికొట్టిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దొంగతో పోట్లాటకు దిగిన తాతయ్య
యూకేలో ఓ ఘటన చోటుచేసుకుంది. 77 ఏళ్ల వృద్ధుడినుంచి ఓ దొంగ డబ్బులు దోచుకునే ప్రయత్నం చేశాడు. ఈ వృద్ధుడు దొంగను నిలువరించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. యూకేలో కార్డిఫ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్మానుష్యమైన ప్రాంతంలో రాత్రివేళలో ఓ వృద్ధుడు తన కారును పార్కు చేసి డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎం దగ్గరకు వెళ్లాడు. డబ్బులు డ్రా చేసుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. తిరిగి కారు వద్దకు వెళుతున్న సమయంలో ఓ దొంగ తనపైకి వచ్చాడు. డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరించాడు. కానీ ఈ తాతయ్య మాత్రం బెదిరిపోలేదు సరికదా దొంగను ధీటుగా ఎదుర్కొన్నాడు.
ముసలోడు కదా.. ఈజీగా దోచేయొచ్చనుకున్నాడు
వృద్ధుడు కదా.. పైగా ఒంటరిగా దొరికాడులే అనుకున్నాడు దొంగ. పంటపండిందనుకున్నాడు. కానీ ఆ వృద్దుడు మాత్రం మామూలుగా ఆ దొంగను బెదరగొట్టలేదు. దమ్ముంటే నాపైకి రా అంటూ సవాలు విసిరినట్లుగా ఉంది. దొంగతో తాతయ్య ఫైట్ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరా కంటికి చిక్కింది. ఆ వృద్ధుడు దొంగతో చాలా ధైర్యంగా ఫైట్ చేశాడు. బేసిక్ బాక్సింగ్ స్కిల్స్‌తో దొంగ పారిపోయేలా చేశాడు. అంతేకాదు దొంగ ముఖంపై నాలుగు పంచులు కూడా విసిరాడు. ఫిబ్రవరి 18న కార్డిఫ్ పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే ఒక్కరోజులోనే ఈ వీడియో తెగవైరల్ అయ్యింది.

తాతయ్య చూపిన ధైర్యంకు నెటిజెన్ల ఫిదా
అంతేకాదు ఈ వీడియోలో ఆ తాతయ్యను చూసిన నెటిజెన్లు సలామ్ చేశారు. ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలు భేష్ అంటూ కొనియాడారు. కుర్రకారుకు తాతయ్య ఇన్స్‌పిరేషన్ అని కొందరు పోస్టులో రాసుకొచ్చారు. అందుకే అప్పుడెప్పుడో స్కూళ్లో నేర్చుకున్న బాక్సింగ్ మెలుకువలు జీవితంలో ఏదో ఒక రకంగా ఉపయోగపడుతాయని మరో నెటిజెన్ కామెంట్ పోస్టు చేశాడు. ఆ వయస్సుల్లో ఈ తాతయ్య ఓ దొంగను బెదరగొట్టాడంటే గ్రేట్.. హ్యాట్సాఫ్ అంటూ మరికొందరు నెటిజెన్లు తాతయ్యను పొగడ్తలతో ముంచెత్తారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications