భారత్ తో గుడ్ డీల్ కుదుర్చుకుంటాం: ట్రంప్
దావోస్ లో జరుగుతున్న 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తో గుడ్ డీల్ కుదుర్చుకోబోతున్నామని తెలిపారు. ఈ మేరకు భారత్- అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ అద్భుతమైన నాయకుడు అని కొనియాడారు. ప్రధాని మోదీపై తనకు అపారమైన గౌరవం ఉందని ట్రంప్ స్పష్టం చేశారు.
భారత్ ఒక వ్యూహాత్మక భాగస్వామి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దావోస్ లో జరుగుతున్న 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ట్రంప్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధం చేస్తున్నప్పటికీ, భారత్ ను మాత్రం ఒక నమ్మకమైన ఆర్థిక భాగస్వామిగా ట్రంప్ అభివర్ణించారు. ఈ మేరకు ప్రధాని మోదీ అద్భుతమైన నాయకుడు అని కొనియాడారు. భారత్ తో త్వరలోనే గుడ్ డీల్ కుదుర్చుకోనున్నట్లు స్పష్టం చేశారు.

ఇక గ్రీన్ లాండ్ విషయంలో.. ఇదే సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ లాండ్ ను అమెరికా తప్ప ఏ దేశమూ రక్షించ లేదని తెలిపారు. గ్రీన్ లాండ్ ను అమెరికాకు అప్పగించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు దావోస్ లోని ప్రపంచ ఆర్థిక సదస్సులో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ లాండ్, డెన్మార్క్ లపై గొప్ప గౌరవం ఉందని పేర్కొన్నారు. గ్రీన్ లాండ్ అమెరికా భద్రతకు అలాగే అంతర్జాతీయ భద్రతకు ఎంతో కీలకం అని ట్రంప్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications