"ఆపరేషన్ సింధూర్ టైంలో 'డివైన్ పవర్' మాకు సాయపడింది"
ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK) లోని 9 కీలక ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. అంతేకాక వందలాది మంది ఉగ్రమూకలను హతమార్చింది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో తమకు డివైన్ పవర్(దేవుడి శక్తి) సాయపడిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఇటీవల నిర్వహించిన నేషనల్ ఉలేమా కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ సైన్యాన్ని దైవశక్తి కాపాడిందని.. నాలుగురోజుల పాటు జరిగిన యుద్ధంలో తాము ఏదో తెలియని దైవానుభూతికి లోనయ్యామని.. తాము ఆ విషయాన్ని ఆస్వాదించామని చెప్పుకొచ్చారు. అసిమ్ మునీర్ ఈ వ్యాఖ్యలు డిసెంబర్ 10 న చేసినట్లు స్పష్టం అవుతోంది. భారత్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో అసిమ్ మునీర్ మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు.

'ఒకవేళ అల్లా మీకు సాయం చేస్తే.. మిమ్మల్ని ఎవరూ అధిగమించలేరు' అంటూ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే అఫ్గాన్ తాలిబన్లకు వార్నింగ్ ఇచ్చారు. అఫ్గాన్ తాలిబాన్ లు పాకిస్థాన్ లేదా తెహ్రీక్ ఈ పాకిస్థాన్(టీటీపీ) ను ఎంచుకోవాలని సూచించారు. టీటీపీలో దాదాపు 70 శాతం మిలిటెంట్లు అఫ్గాన్ కు చెందినవారేనని అన్నారు. అలాగే ఇస్లామిక్ స్టేట్ లో జిహాద్ ను ప్రకటించే అధికారం అక్కడి ప్రభుత్వానికి తప్ప మరెవరికీ లేదని అసిమ్ మునీర్ స్పష్టం చేశారు. జిహాద్ కోసం ఫత్వాను ఎవరూ కూడా జారీ చేసేందుకు అధికారం లేదని అన్నారు. ప్రస్తుతం అసిమ్ మునీర్ కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
#BREAKING
— Madhurendra kumar मधुरेन्द्र कुमार (@Madhurendra13) December 21, 2025
पाक आर्मी चीफ का हास्यास्पद बयान:
भारत के साथ मई में हुए सैन्य टकराव को पाकिस्तान को “divine intervention
(दैवीय हस्तक्षेप)” का सहारा मिला “We felt it”🤣🤣 pic.twitter.com/viWic7HQJB
ఇక ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో పాకిస్థాన్ కు చెందిన నలుగురు ఉగ్రమూకలు జరిపిన భీకర కాల్పుల్లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. మే7-10 వరకు దాడులు జరిపింది. పాకిస్థాన్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యాయి. అలాగే పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఆర్మీ బేస్ లు కూడా ధ్వంసం అయ్యాయి. అలాగే పాకిస్థాన్ పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల పంపిణీ నిలిపివేత, ఇరు దేశాల మధ్య గగతలాలు రద్దు.. తదితర కఠిన నిర్ణయాలు తీసుకుంది.












Click it and Unblock the Notifications