వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోదీ, జో బైడెన్‌‌ మధ్య ఏ అంశాలు చర్చకొచ్చాయి?- Newsreel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు.

ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి గురించి వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి.

'' ఈ దశాబ్ధంలో వ్యాపార రంగం చాలా కీలకమైంది. ఈ రంగంలో భారత్, అమెరికాలు ఇచ్చి పుచ్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి'' అని ప్రధానమంత్రి మోదీ అన్నారు.

https://twitter.com/narendramodi/status/1441429367804993547

అంతకు ముందు తాను భారత ప్రధానమంత్రి చర్చలు జరపబోతున్నానని, ఆయనను వైట్‌హౌస్‌కు ఆహ్వానించానని జో బైడెన్ ట్వీట్ చేశారు. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు కావాలని తాను కోరుకుంటున్నానని బైడెన్ అన్నారు. పలురంగాల్లో కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు బైడెన్ తన ట్వీట్‌లో వెల్లడించారు.

https://twitter.com/POTUS/status/1441418775174258689

ఎన్నో ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపించడంలో భారత్-అమెరికా సంబంధాలు సాయం చేస్తాయని బైడెన్ అన్నారు. ఈ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడిగా గతంలో భారత్ వచ్చిన విషయాన్ని బైడెన్ గుర్తు చేసుకున్నారు.

భారత ప్రధాని మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్

కమలా హారిస్‌ మోదీ భేటీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను తొలిసారిగా గురువారం వాషింగ్టన్‌లో కలిశారు.

అమెరికా చరిత్రలో ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళ, తొలి దక్షిణాసియా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నిక కావడం చరిత్రాత్మకమని పేర్కొంటూ మోదీ ఆమెకు అభినందనలు తెలియజేశారు. భారతదేశానికి రమ్మని ఆహ్వానించారు.

"భారత ప్రజలు మీకు స్వాగతం పలకడానికి వేచి చూస్తున్నారు" అని మోదీ అన్నారు.

https://twitter.com/narendramodi/status/1441205902783041542

'కమలా హారిస్‌ను కలవడం సంతోషంగా ఉంది. ఆమె విజయం ప్రపంచానికే స్ఫూర్తినిచ్చింది. భారత్, అమెరికాల స్నేహబంధం మరింత బలోపేతం అయ్యేలా మేం ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

కాగా, నవంబర్‌లో అమెరికా ఎన్నికల ఫలితాలు వెల్లడించిన అనంతరం, కమలా హారిస్ గెలుపును పురస్కరించుకుని ఆమె పూర్వీకుల గ్రామం తులసేంద్రపురంలో టపాసులు వెలిగించి సంబరాలు చేసుకున్నారు.

మోదీ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో తొలిసారిగా సమావేశం కానున్నారు. దాంతో, మూడు రోజుల పాటు కొనసాగిన భారత ప్రధాని అమెరికా పర్యటన ముగియనుంది.

అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనుదిరిగిన కొన్ని వారాల్లోనే తాలిబాన్ ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ నెల ప్రారంభంలో తాలిబాన్ ప్రతినిధి బీబీసీతో మాట్లాడుతూ, "భారతదేశంలో కశ్మీరీ ముస్లింల కోసం గొంతు విప్పుతాం" అన్నారు.

2019లో అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో, భారతదేశంలో ఆర్టికల్ 377 రద్దును కమలా హారిస్ ఖండించారు.

శుక్రవారం బైడెన్‌తో పాటూ మోదీ "క్వాడ్" సమావేశానికి హాజరు కానున్నారు. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ అధ్యక్షులతో సమావేశం కానున్నారు.

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సంబంధాలను, సహకారాన్ని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ప్రయత్నమే "క్వాడ్".

స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది. శుక్రవారం మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్ 60,000 పాయింట్లు దాటింది.

మరో సూచీ నిఫ్టీ కూడా 18,000 పాయింట్లకు దగ్గర్లో ఉంది.

శుక్రవారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నప్పటికీ సెన్సెక్స్ మాత్రం సరికొత్త మైలు రాయి దాటింది.

శుక్రవారం ఉదయం 9.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 375 పాయంట్లు లాభపడి 60,260 వద్ద ఉందని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

https://twitter.com/ANI/status/1441249227972091914

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What issues came up for discussion between Modi and Biden
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X