వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్ జాంగ్ ఉన్ ఎంత భయంకరమైన వాడంటే: ట్రంప్, వారు కన్నీరుమున్నీరు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తర కొరియా అణు ప్రయోగాలు అమెరికాపై తీవ్ర ప్రభావం చూపబోతుందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. తొలిసారి ఆయన అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉత్తర కొరియా గురించి మాట్లాడారు. గత ప్రభుత్వాలు ఉత్తర కొరియా విషయాన్ని సరిగ్గా పట్టించుకోకుండా అమెరికా భద్రతను ప్రమాదంలోకి నెట్టాయని ఆరోపించారు.

తాను మాత్రం ఆ తప్పు మళ్లీ జరగనివ్వనని చెప్పారు. భవిష్యత్తులో అమెరికాలోని చాలా నగరాలు ఉత్తర కొరియా అణు కార్యక్రమం ద్వారా ముప్పును ఎదుర్కొంటాయన్నారు. ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్‌ జాంగ్ ఉన్ తన దేశ ప్రజలను ఇబ్బంది పెట్టినంతగా మరెవ్వరూ ఇబ్బంది పెట్టలేదన్నారు.

కిమ్ జాంగ్ ఉన్ చర్యలు ఎంత భయంకరంగా ఉంటాయంటే

కిమ్ జాంగ్ ఉన్ చర్యలు ఎంత భయంకరంగా ఉంటాయంటే

అణు దేశమైన ఉత్తర కొరియాను అణచి వేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. కిమ్‌ చర్యలు ఎంత భయంకరంగా ఉంటాయో వివరిస్తూ గతేడాది ఉత్తర కొరియాలో చనిపోయిన అమెరికన్‌ విద్యార్థి గురించి, 2006లో ఉత్తర కొరియా నుంచి పారిపోయి దక్షిణ కొరియాలో స్థిరపడిన సియోంగ్‌ అనే వ్యక్తి గురించి ప్రస్తావించారు.

ఒట్టో వార్మ్ గురించి

ఒట్టో వార్మ్ గురించి

ఒట్టో వార్మ్ బియర్ యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో చాలా కష్టపడి చదివే విద్యార్థి అని, ఆసియాలో విద్యను అభ్యసించడానికి వెళ్లే ముందు విహారయాత్ర కోసం ఉత్తర కొరియా వెళ్లాడని, యాత్ర ముగించుకొని వస్తుండగా అక్కడి అధికారులు అతనిని అరెస్టు చేసి తప్పుడు కేసులు పెట్టారని ట్రంప్ చెప్పారు. అనంతరం అతనికి పదిహేనేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారని చెప్పారు. అతనిని అమెరికాకు తీసుకు రావడానికి ముందు ఒట్టో గాయపడి, అమెరికాకు వచ్చిన కొద్ది రోజులకు చనిపోయాడన్నారు. ఈ ప్రసంగ కార్యక్రమంలో ఒట్టో తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఓట్టో ప్రస్తావన వచ్చినప్పుడు వారు కన్నీరుమున్నీరు అయ్యారు.

జి సియోంగ్ గురించి

జి సియోంగ్ గురించి


అనంతరం ట్రంప్‌ ఉత్తర కొరియా వాసి జి సియోంగ్‌ హో గురించి ప్రస్తావించారు. సియోంగ్‌ 2006లో ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా వచ్చాడని, అతను ఓసారి రైలు పట్టాలు దాటుతుండగా కాలు పట్టాల మధ్యలో ఇరుక్కుపోయి ఎడమ చేయి, కాలు తెగిపోయాయని, సియోంగ్‌ ఉత్తర కొరియా నుంచి పారిపోతున్నాడని తెలిసి అక్కడి అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని ట్రంప్ చెప్పారు.

ఆకలికి తట్టుకోలేక చైనా సరిహద్దు దాటుతుండగా

ఆకలికి తట్టుకోలేక చైనా సరిహద్దు దాటుతుండగా

ఆకలికి తట్టుకోలేక అతను ఓసారి ఆహారం కోసం చైనా సరిహద్దు దాటుతుండగా అధికారులు అతనిని పట్టుకుని చిత్ర హింసలు పెట్టారని ట్రంప్ చెప్పారు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకుని 2006లో దక్షిణ కొరియా చేరుకొన్నాడని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా జీవిస్తున్నాడని చెప్పారు. కాగా, ఉత్తర కొరియాపై ట్రంప్ వ్యాఖ్యలు ఆ దేశానికి బ్యాడ్ న్యూస్ అని నిపుణులు అంటున్నారు.

English summary
President Donald Trump's fiery comments on North Korea reflected confidence that his campaign of pressure and sanctions on the country is working, South Korean analysts said Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X