మరో మైలురాయికి వాట్సప్: యూజర్ల సంఖ్య 100 కోట్లు
ప్రముఖ మెసేజింగ్ సర్వీస్ వాట్సప్ ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. వాట్సప్ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరుకుంది. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్స్ బర్గ్ తన ఫేస్‌బుక్ పేజి ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వాట్సాప్ సహ వ్యవస్థాపకులు బ్రెయిన్ ఆక్టన్, జాన్ కోమ్‌ను ఆయన అభినందించారు.
ఫేస్‌బుక్‌కు చెందిన ఈ యాప్‌ను సోమవారం నాటికి వంద కోట్ల మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. 2014లో ఫేస్‌బుక్ యాజమాన్యం వాట్సాప్‌ను సొంతం చేసుకున్నాక యూజర్లు సంఖ్య గణనీయంగా పెరిగింది. తమ యాప్‌ను ఆదరించిన వారందరికీ ఈ సందర్భంగా ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కృతజ్ఞతలు తెలిపారు.
'ఫేస్‌బుక్‌లో చేరాక వాట్సాప్ యూజర్లు రెట్టింపు అయింది. వాట్సాప్ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా మరింతమందికి సేవలందించేందుకు కృషి చేస్తున్నాం. మా తర్వాతి లక్ష్యం ఈ సర్వీసును వ్యాపారంతో అనుసంధానిస్తాం' అని తన ఫేస్‌బుక్ పేజీలో జూకర్స్ బర్గ్ పోస్టు చేశారు.

యాహూ మాజీ ఉద్యోగులైన బ్రెయిన్ ఆక్టన్, జాన్ కోమ్ 2009లో వాట్సాప్‌ను స్థాపించారు. దీన్ని 2014 ఫిబ్రవరి 19న 19.3 బిలియన్ డాలర్లకు ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. అప్పటికి 50 మిలియన్లు ఉన్న యూజర్ల సంఖ్య కేవలం రెండేళ్లలో రెట్టింపు అయింది.
'ప్రతినెలా ప్రపంచంలో ఏడుగురిలో ఒకరు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రేమికులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమాచారం పంచుకుంటున్నారు. జాతీయ విపత్తులు, ఆరోగ్య సమస్యల నుంచి శుభకార్యాలు, వ్యాపారాల వరకు సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు' అని వాట్సప్ టీమ్ ఈ సందర్భంగా పేర్కొంది.
ఇది ఇలా ఉంటే, వంద కోట్ల యూజర్లు కలిగిన వాట్సప్ ద్వారా రోజుకు 42 కోట్ల మెసేజ్‌లను షేర్ చేసుకుంటున్నారు. 1.6 బిలియన్ ఫొటోలు షేర్ అవుతున్నాయి. 1 బిలియన్ గ్రూపులు వాట్సప్‌లో ఉన్నాయి.
One billion people now use WhatsApp. Congrats to Jan, Brian and everyone who helped reach this milestone! WhatsApp's...
Posted by Mark Zuckerberg on Monday, February 1, 2016
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications