వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పాట్ చెబితే.. బాంబులేస్తాం: ఒబామాతో పుతిన్

|
Google Oneindia TeluguNews

అంటాల్యా: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను సిరియాలో పూర్తిగా అణగదొక్కే క్రమంలో తాము చేస్తున్న యుద్ధానికి సహకరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు ఒబామాను కోరారు. టర్కీలో జరిగిన జి20 సదస్సు సందర్భంగా ఒబామాతో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా అంతరిక్షంలో ఉంచిన అత్యాదునిక శాటిలైట్ల ద్వారా ఉగ్రవాదుల స్థావరాలను, కదలికలను గుర్తించి, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ వివరాలను చెబితే.. తాము నిమిషాల్లో అక్కడికి వెళ్లి విధ్వంసం సృష్టించి వస్తామని పుతిన్ స్పష్టం చేశారు.

సరైన ప్రాంతం గురించిన సమాచారం లేకుండా వెళితే.. సామాన్యుల ప్రాణాలు కూడా పోతున్నాయని, అందువల్ల సరిగ్గా ఎక్కడ బాంబుల వర్షం కురిపించాలో తెలియజేయాలని పుతిన్ కోరారు.

When Putin asked Obama for ‘exact longitude, latitude’ to drop bombs

ఇది ఇలా ఉండగా, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలనను అమెరికా వ్యతిరేకిస్తుంటే.. రష్యా మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచింది. ఈ విషయంలో అభిప్రాయాలు ఒకటికానప్పటికీ, ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రవాదంపై పోరు విషయంలో మాత్రం ఇరు దేశాలూ కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

తమ అనుమతిలేకుండా తమ సరిహద్దులో ప్రవేశించిందని ఇటీవల ఉగ్రవాదులపై దాడుల కోసం బయల్దేరిన రష్యన్ యుద్ధ విమానాన్ని టర్కీ కూల్చేసిన విషయం తెలిసిందే. దీనిపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదులపై పోరాడుతుంటే తమ విమానాన్ని కూల్చేయడం సరికాదని పేర్కొంది.

అయితే, ఆ దేశ రక్షణలో భాగంగా టర్కీ రష్యన్ విమానాన్ని కూల్చేయడం తప్పేమి కాదని అమెరికా అధ్యక్షుడు ఒబామా పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపైనా వ్లాదిమీర్ పుతిన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

English summary
An exasperated Russian leader Vladimir Putin asked US President Barack Obama for the "exact longitude and latitude" where he could ask his military jets to drop bombs in the campaign against the Islamic State at the recently concluded G20 summit in Antalya, Turkey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X