వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్ న్యూస్: అత్యవసర వినియోగంకు మరో వ్యాక్సిన్... అమెరికా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం

|
Google Oneindia TeluguNews

జెనీవా: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరో కొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికా కంపెనీ మోడెర్నా తయారు చేస్తున్న టీకాకు ఎమర్జెన్సీ వినియోగం కోసం ఆమోదం తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ . దీంతో ఎమర్జెన్సీ వినియోగం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓకే చేసిన ఆస్ట్రా జెనెకా, ఫైజర్-బయోఎన్‌టెక్, మరియు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌ల జాబితాలో మోడెర్నా టీకా చేరింది. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ కొరతతో ఇబ్బంది పడుతున్న పలు దేశాలు అత్యవసర వినియోగం కోసమే ఆమోదం తెలిపినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో మందులు, టీకాలు, డయాగ్నస్టిక్స్‌కు సంబంధించి ఎక్కడా కొరత రాకుండా చూడాలన్నదే తమ ముందున్న లక్ష్యమని వివరించింది.

ఇక వ్యవస్థలో మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రావాలని సంక్షోబం నెలకొన్నప్పుడు వ్యాక్సిన్లు లేకపోతే పరిస్థితి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ మారియాంజెలా సిమావ్ అన్నారు. ప్రపంచ దేశాలకు భారత్ నుంచి కొవాగ్జిన్ సరఫరా కాగా... ప్రస్తుతం భారత్‌లో కరోనా కేసులు తారాస్థాయికి చేరినందున భారత్ నుంచి సరఫరా నిలిచిపోయిందని గుర్తుచేశారు. మరోవైపు టీకా ఉత్పత్తిని 2022 నాటికి 3 బిలియన్ డోసులకు పెంచుతామని మోడెర్నా సంస్థ వెల్లడించింది. అయితే మోడెర్నా నుంచి కరోనాకు తీసుకొచ్చిన టీకాపై జనవరిలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది ఫైజర్, మరియు బైయోఎన్‌టెక్‌ సంస్థలకు అత్యవసర అనుమతులను చివరినిమిషంలో ఇవ్వడం జరిగింది.

WHO gives green signal to Moderna Vaccine for emergency use

Recommended Video

COVID Vaccine For 18+ : నోస్టాక్..వ్యాక్సిన్ కోసం జనం బారులు... Vaccines Shortage || Oneindia Telugu

ఇక అప్పటి నుంచి ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్, సీరం ఇన్స్‌టిట్యూట్‌లకు చెందిన టీకాలకు అనుమతులు ఇచ్చింది. ఇక చైనా నుంచి ఉత్పత్తి అవుతున్న సైనోఫార్మ్ టీకా సైనోవాక్‌కు కూడా త్వరలో అనుమతులు ఇవ్వనున్నట్లు సమాచారం. దీనికి వచ్చేవారం అనుమతి రావొచ్చని తెలుస్తోంది. ఇక భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రోజుకు 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం కొన్ని వేలమంది మృత్యువతా పడుతుండటం కలవర పెడుతోంది. ఇక శనివారం నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వారికి టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టింది భారత ప్రభుత్వం. అయితే కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఉండటంతో అక్కడ టీకా కార్యక్రమం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.

English summary
The World Health Organisation has given the go-ahead for emergency use of Moderna's COVID-19 vaccine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X