Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అంతర్జాతీయ ఉగ్రవాదిగా భారత సంతతి వ్యక్తి

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన ఐసిస్‌ ఉగ్రవాది సిద్ధార్థ్‌ ధార్‌(అబూ రుమైసా)ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది అమెరికా. బ్రిటన్‌కు చెందిన సిద్ధార్థ్‌ హిందూ మతం నుంచి ఇస్లాంకు మారాడు. ఆ తర్వాత తన పేరును అబూ రుమైసాగా మార్చుకున్నాడు.

కాగా, సిద్ధార్థ్‌ను ఇప్పుడు 'న్యూ జిహాదీ జాన్‌'గా పిలుస్తున్నారు. అతడు ఐసిస్‌లో సీనియర్‌ కమాండర్‌గా మారినట్లు పలు పత్రికలు కథనాలు వెల్లడించాయి. నిహాద్‌ బరకత్‌ అనే యాజిదీ బాలిక తనను సిద్ధార్థ్‌ ధార్‌ అపహరించి మానవ అక్రమ రవాణా చేశాడని తెలిపినట్లు ఇండిపెండెంట్‌ పత్రిక వెల్లడించింది.

Who is the the Indian origin ‘New Jihadi John’ alias Siddharth Dhar a,k.a Abu Rumaysah

సిద్ధార్థ్‌ థార్‌తో పాటు బెల్జియన్‌-మెరాకన్‌ పౌరుడైన అబ్దెలతీఫ్‌ గైనిలను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించినట్లు అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. ఈ మేరకు వారిపై పలు ఆంక్షలు విధించినట్లు తెలిపింది.
సిద్ధార్థ్‌ 2014లో భార్య పిల్లలతో కలిసి యూకే వదిలి సిరియాకు వెళ్లి ఐసిస్‌లో చేరినట్లు సమాచారం.

ఈ ఇద్దరు నుంచి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని అమెరికా తమ దేశ పౌరులతో పాటు అంతర్జాతీయ సమాజాన్ని హెచ్చరించింది. ఐసిస్‌లో జిహాదీ జాన్‌గా పిలిచే మొహమ్మద్‌ ఎమ్వాజి స్థానంలో సిద్ధార్థ్‌ను నియమించినట్లు తెలుస్తోంది. 2015లో జరిపిన దాడుల్లో మొహమ్మద్ ఎమ్వాజీ హతమైన విషయం తెలిసిందే. కాగా, 2016 జనవరిలో ఐసిస్‌ విడుదల చేసిన వీడియోలో ముసుగుతో కనిపించిన ఉగ్రవాది అబూ రుమైసా అని భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+