వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐరోపా సమాఖ్య పై ఏంజెలా మెర్కెల్ మార్క్: ఆమె వారుసులు ఎవరు: విశ్లేషకులు ఏం చెబుతున్నారు..?

|
Google Oneindia TeluguNews

జర్మనీ మాజీ వైస్ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ రాజకీయాలనుంచి వైదొలగడంతో ఐరోపా సమాఖ్యలో కచ్చితంగా లోటు కనిపిస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 16 ఏళ్లుగా జర్మనీ వైస్ ఛాన్సెలర్‌గా సేవలందించిన మెర్కెల్ ఆ సమయంలో ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు యురోపియన్ యూనియన్‌లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం అలాంటి నాయకురాలు లేకపోవడంతో ఐరోపా సమాఖ్య బలహీనంగా కనిపిస్తోంది.

ఐరోపా దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీ దేశ బాధ్యతలు, మెర్కెల్ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆదేశ ఆర్థికశాఖ మంత్రి ఓలాఫ్ స్కోల్జ్ సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని మారియో డ్రాఘిలు కూడా మెర్కెల్ లోటును భర్తీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే అంతర్జాతీయ విశ్లేషకులు మాత్రం మెర్కెల్‌ లోటును భర్తీ చేయడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత సమస్యలు, రాజకీయపరమైన సమస్యలు, ముఖ్యంగా బ్రెగ్జిట్ తర్వాత ఉత్పన్నమైన సమస్యలను అధిగమించాలంటే వీరికి సవాలుతో కూడుకున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మెర్కెల్ మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆమె దానికే కట్టుబడి ఉండేవారని, ఎలాంటి కష్టాలు ఎదురైన పక్కకు తప్పుకునేవారు కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇన్ని సవాళ్ల మధ్య అలాంటి నిర్ణయం తీసుకుని యూరోపియన్ యూనియన్‌ను ముందుకు తీసుకెళ్లే నాయకులు తమకు కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

Who will be the successor of Angela Merkel at EU,Can Macron lead the council-know challenges ahead for the successor

తన 16 ఏళ్ల పాలనలో ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నారంటే మెర్కెల్ దానికి కట్టుబడి ఉండేవారని, కొందరు విబేధించినప్పటికీ పక్కకు తప్పుకోకుండా ముందుకు సాగేవారని చెబుతున్నారు. అందుకే మెర్కెల్‌కు సర్వత్రా మద్దతు ఉండేదని గుర్తు చేశారు. ఒక తరంలో మెర్కెల్ లాంటి లీడర్లు దొరకడం చాలా అరుదుగా జరుగుతుందని స్పెయిన్‌లోని ఐఈఎస్ఈ బిజినెస్ స్కూల్‌కు చెందిన సెబాస్టియన్ చెప్పారు. విదేశీ సంబంధాలపై యూరోపియన్ సమాఖ్య‌కు ఎవరు నాయకత్వం వహిస్తే బాగుంటుందనే దానిపై ఈ మధ్యే ఒక సర్వే జరిగింది. ఒకవేళ మెర్కెల్ యాక్టివ్‌గా ఉన్నట్లయితే ఆమెకే తామంతా ఓటు వేసేవారమని 41శాతం మంది ప్రజలు చెప్పారు. మరోవైపు మాక్రాన్‌కు 14శాతం మంది మాత్రమే ఓటు వేశారు. ఇక మెర్కెల్ నడిపే దౌత్యపరమైన సంబంధాలతో చాలా దేశాలు ఆమెతో ఏకీభవించారని విమర్శకులు చెబుతున్నారు. ఆ స్థిరత్వం మెర్కెల్‌ సొంతమని గుర్తు చేస్తున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో కఠినంగా వ్యవహరించే రష్యా చైనా లాంటి దేశాలను కూడా ఆమె కన్విన్స్ చేయడంలో సక్సెస్ అయ్యారని విమర్శకులు చెబుతున్నారు. మెర్కెల్ రాజకీయాల నుంచి వైదొలగడంతో ఇప్పుడు ఆ డ్రైవర్ సీట్‌లోకి మాక్రాన్ వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

43 ఏళ్ల ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్‌కు యురోపియన్ సమాఖ్యను ముందుండి నడిపించడం అంత సులభం కాదు. ఇది పెద్ద సవాలుతో కూడుకున్న పని అని విశ్లేషకులు చెబుతున్నారు. అదికాకుండా బ్రెగ్జిట్ తర్వాత మరిన్ని కొత్త సమస్యలు వచ్చాయి. ఇక ఈ మధ్యే ఫ్రాన్స్-జర్మనీ సంబంధాలపై జర్మనీ మంత్రి డ్రాఘీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఈ సంబంధాలు దెబ్బ తినకుండా ఇంకొకరిని నొప్పించకుండా చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా వచ్చే ఏడాది అంటే 2022 ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలు కూడా ఉన్నాయి. ఏ కొంచెం పొరపాటు చేసినా ... మాక్రాన్ ఖేల్ ఖతం అవుతుంది. ఇక యూరోపియన్ యూనియన్‌కు నేతృత్వం వహించడం కంటే తాను ముందుగా తన దేశంలో జరిగే ఎన్నికలపైనే దృష్టి సారించాల్సి ఉంటుంది.

మొత్తానికి మెర్కెల్ స్థానంలో 63 ఏళ్ల స్కోల్జ్ బాధ్యతలు చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ... మెర్కెల్‌లా మాత్రం పనిచేయకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో కొత్త తరంలో మెర్కెల్ ఆలోచనలు అమలు కావడం కూడా కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

English summary
Angela Merkel's departure from the political stage after 16 years as chancellor has not only ushered in a new era in Germany but also shakes up the power balance in the EU.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X