వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవీకి శుక్ర కణాలకు లింక్ : ఎక్కువ సేపు చూస్తే.. అంతే సంగతి

|
Google Oneindia TeluguNews

లండన్ : గంటల తరబడి టీవీలకు అతుక్కుపోయేవాళ్లకు.. పొద్దస్తమానం కంప్యూటర్ స్క్రీన్ లోనే తలదూర్చే వాళ్లకు ఇదో హెచ్చరిక లాంటిది. ఎందుకంటే.. ఎక్కువ సేపు టీవీలు, కంప్యూటర్ల ముందు గడిపే మగవాళ్లలో శుక్ర కణాల స్థాయి పడిపోతుందని చెబుతున్నారు పరిశోధకులు. కోపెన్ హాగెన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 1200 మంది ఆరోగ్యవంతులైన యువకుల మీద పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని వెల్లడించారు.

పరిశోధన ద్వారా వెల్లడైన విషయాలేంటంటే.. సాధారణంగా టీవీ తక్కువగా చూసే యువకుల్లో మిల్లీమీటరు వీర్యంలో 52 మిలియన్ల శుక్ర కణాలు ఉంటే, రోజుకు 5గంటలు టీవీ చూసే యువకుల్లో మిల్లీ మీటరు వీర్యానికి కేవలం 37 మిలియన్ల శుక్ర కణాలు మాత్రమే ఉన్నట్లు నిర్దారించారు పరిశోధకులు. ఎక్కువసేపు టీవీ లేదా కంప్యూటర్ ముందు గడిపే యువకుల్లో టెస్టో స్టిరాన్ హార్మోన్ స్థాయి పడిపోతున్నట్లుగా పరిశోధకులు చెబుతున్నారు.

 Why too much TV makes men less fertile: Watching more than five hours a day can cut a man's sperm count by a THIRD

ఎక్కువసేపు టీవీ లేదా కంప్యూటర్ ముందు కూర్చుని ఉండడం వల్ల శరీరానికి తగినంత వ్యాయామం, సరైన ఆహారం అందక.. దాని ప్రభావం సంతాన సమస్యలు కొనితెచ్చేదిగా మారుతుందని చెబుతున్నారు వర్సిటీ పరిశోధకులు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం కూడా ఈ సమస్యకు కారణమనేది పరిశోధకుల మాట. అయితే వారానికి 15గంటల వ్యాయామం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునని అమెరికన్ శాస్త్రవేత్తలు 2013లోనే తేల్చారు.

English summary
The Olympics may be providing a vibrant festival of sport for armchair fans the world over. But for men hoping to become a father at any point in the future, the games could spell problems ahead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X