బద్ధ శత్రువును ఆహ్వానిస్తాంటూ ట్రంప్ సంచలనం
వాషింగ్టన్: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా బద్ధశత్రువైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్-ఉన్‌ను అమెరికాకు ఆహ్వానిస్తానని రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ట్రంప్ పేర్కొన్నారు.
అయితే అధికారిక స్టేట్ డిన్నర్‌కు కాదని చెప్పారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మండిపడ్డారు. కిమ్‌తో మాట్లాడాలన్న ట్రంప్ ఉద్దేశాన్ని హిల్లరీ విమర్శించారు.

హిల్లరీ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్.. కిమ్‌ను ఆహ్వానిస్తాననడంలో తప్పేముందని అన్నారు. అది కేవలం ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి చర్చ ప్రారంభించడం కోసమేనని ట్రంప్ వెల్లడించారు.
బహుశా ఆ సమావేశం జరగకపోవచ్చని కూడా అన్నారు. తాను కూడా ఉత్తరకొరియాకు వెళ్లనని చెప్పారు. నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి హిల్లరీ క్లింటన్ పోటీపడుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications