అదానీపై జో బైడెన్ సర్కారు కుట్ర?: అదే కారణమా??

భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై మరోసారి అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లోని అధికారులకు భారీగా లంచం ఇచ్చారని అభియోగాలు మోపింది. అమెరికాకు చెందిన అజూర్ పవర్‌తో కలిసి అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎస్ఈసీఐతో 12 జీడబ్ల్యూ సౌర విద్యుత్ ఒప్పందాన్ని పొందిందని అభియోగపత్రంలో ఆరోపించింది.

రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలను ఖరీదైన విద్యుత్ ఒప్పందాలు అంగీకరించేలా చేయడానికి, ఈ కంపెనీలు భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలకు 256 మిలియన్ డాలర్లు లంచంగా ఇచ్చారని ఆరోపించింది. అయితే, అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను ఖండించింది. తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేసింది. నిరాధారమైన, అసత్య ఆరోపణలంటూ వాటిని కొట్టిపారేసింది.

Wishes to Trump Is there a hidden conspiracy by the US government against Adani

అదానీ గ్రూప్‌పై అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వం కుట్ర ఏమైనా ఉందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్‌పై ఓ దుండగుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ దాడిలో ట్రంప్ తృటిలో తప్పించుకున్నారు. ఆ సమయంలో అదానీ.. ట్రంప్‌కి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేగాక, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ట్రంప్‌నకు అదానీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రస్తుతం అమెరికాలోని డెమోక్రాట్లకు, డెమోక్రాట్ లాబీయిస్టుల మద్దతుతో చైనా కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అవి యునైటెడ్ స్టేట్స్ ఇన్‌ఫ్రా అండ్ ఎనర్జీ ప్రాజెక్టులో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడతానని హామీ ఇచ్చారని తెలుస్తోంది. మరోవైపు, చైనా వాణిజ్య దురాక్రమణను ఎదుర్కోవడానికి అదానీ కీలకంగా వ్యవహరిస్తున్నారు.

అదానీ కొలంబోలో ఒక ఓడరేవును, ఇజ్రాయెల్ హైఫాలో, టాంజానియా్లో ఓడ రేవుల్ని నిర్మిస్తున్నారు. ఇది భౌగోళికంగా రాజకీయంగా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే త్వరలో దిగిపోబోతున్న బైడెన్ ప్రభుత్వం.. ఉద్దేశపూర్వకంగానే ఈ ఆరోపణలు చేస్తోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో హిండెన్ బర్గ్ రిపోర్టులాగే తాజా ఆరోపణలు భారతీయ పారిశ్రామికవేత్తల పరువు తీయడానికే ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, అదానీపై నేరాభియోగాలు మోపిన ప్రాసిక్యూటర్ బ్రియాన్ పస్ కు డెమోక్రాట్ నేతలతో మంచి సంబంధాలుండటం గమనార్హం. సోషల్ మీడియాలో పోస్టుల ప్రకారం.. బ్రియాన్ పీస్‌కి డెమోక్రాట్ సెనెటర్ చక్ షుమర్ తో సంబంధాలున్నాయి. పీస్ జ్యుడీషియల్ నియామకంలో షుమెర్ పాత్ర ఉంది. ఇతడి నియామకంపై 2021లోనే వివాదం చెలరేగితే.. షమెర్ మద్దతు తెలిపాడు. అయితే, దీన్ని బట్టి చూస్తే అదానీపై కేసులో పొలిటికల్ అజెండాలో భాగంగా ఉందని అంటున్నారు.

అయితే, ఈ షమెర్‌కి డీప్ స్టేట్‌ని నడిపిస్తున్న బిలియనీర్ జార్జ్ సోరెస్‌తో సంబంధం ఉంది. అంతేగాక, మరో నాలుగు రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న వేళ తాజా ఆరోపణలు రావడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రగా అభివర్ణిస్తున్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో వక్ఫ్ బిల్లు వంటి కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఈ సమయంలోనే అదానీ కేంద్రంగా రాజకీయ దుమారం చర్చనీయాంశంగా మారింది. ఈ అన్ని పరిణామాలు కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కుట్ర కోణం ఏదైనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ కూడా ట్రంప్ గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+