వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పువ్వు మిస్సింగ్.. పోలీసులు ఉరుకులు పరుగులు.. దాని విలువ తెలిస్తే...

పూల మార్కెట్‌లోని ఓ దుకాణంలో ఎవరో ఓ పువ్వును ఎత్తుకెళ్లారు. ఆ విషయం గ్రహించిన దుకాణం సిబ్బంది కంగారుపడిపోయి పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా హుటాహుటిన వచ్చి సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించి, ఆ పు

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బీజింగ్: పూల మార్కెట్‌లోని ఓ దుకాణంలో ఎవరో ఓ పువ్వును ఎత్తుకెళ్లారు. ఆ విషయం గ్రహించిన దుకాణం సిబ్బంది కంగారుపడిపోయి పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా హుటాహుటిన వచ్చి సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించి, ఆ పువ్వును తీసుకెళ్లిన వ్యక్తిని గుర్తించి, ఆ వ్యక్తి ఇంటికెళ్లి మరీ పువ్వును స్వాధీనం చేసుకున్నారు.

వార్నీ.. వందల రకాలు.. వేలకొద్దీ పూలు ఉండే పూల మార్కెట్ లో ఒక్క పువ్వును ఎవరో తీసుకెళితే ఇంత హంగామానా? పూల దుకాణం వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం ఏమిటి? వాళ్లు ఉరుకులు పరుగులు పెట్టి మరీ దాన్ని రికవరీ చేయడం ఏమిటి అనుకుంటున్నారు కదూ? దాని విలువ తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు మరి.

Woman Mistakenly Takes Home a Rare Flower Worth $3 Million in China

అసలేం జరిగిందంటే... చైనాలోని ఓ తైవానీస్‌ పూల దుకాణానికి వచ్చిన ఓ మహిళ ఓ పువ్వును కొనుగోలు చేసింది. తీరా డబ్బు చెల్లించాక, అదంత బాగాలేదనుకుని అక్కడే పెట్టేసి, దుకాణం యజమానికి చెప్పకుండానే దాని పక్కనే ఉన్న ఐరీస్‌ జపొనికా(బటర్‌ఫ్లై ఫ్లవర్‌)గా పిలిచే మరో వువ్వును తీసుకుని ఇంటికెళ్లిపోయింది.

ఆ మహిళ వెళ్లిపోయిన కాసేపటి తర్వాత దుకాణంలో ఐరీస్‌ జపొనికా పువ్వు కనిపించక పోవడంతో దుకాణం సిబ్బంది కంగారు పడిపోయారు. ఎందుకంటే అది చాలా అరుదైనది. ఎనిమిది సంవత్సరాలపాటు ఎంతో కష్టపడి సేద్యం చేసి దాన్ని అభివృద్ధి చేశారు. ఆ పువ్వు విలువ దాదాపు రూ. 20 కోట్లు.

Recommended Video

FB Viral Video: Chinese Man Drinks 3 Litres Of Cool Drink In Just Over 1 Minute | Oneindia Telugu

ఆ పువ్వును ఉపయోగించి అలాంటి పూల మొక్కల్నే పెంచాలని.. తద్వారా తన పూల వ్యాపారం లాభాల బాట పట్టించాలని కూడా సదరు దుకాణం యజమాని కలలు కన్నాడు. అంతేకాదు.. ఆ పూల కోసం పలు సంస్థల నుంచి ఇప్పటికే ఆర్డర్లు కూడా వచ్చాయట.

ఇంతలో ఉన్నట్లుండి ఉన్న ఒక్కగానొక్క పువ్వు కూడా మాయం అయిపోయింది. దీంతో సిబ్బందికి గుండెలు జారిపోయాయి. దుకాణం యజమాని ఎక్కడ తిడతాడో అనే భయంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు రంగంలోకి దిగడం వెంటవెంటనే జరిగిపోయాయి.

పూల దుకాణంలోని సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఎట్టకేలకు ఆ పువ్వును తీసుకెళ్లిన మహిళను గుర్తించారు. ఆమె కారు నెంబరు ఆధారంగా చిరునామా కనుక్కొని ఇంటికి వెళ్లారు.
ఆ పువ్వు విలువ తెలుసుకున్న తరువాత ఆ మహిళ సారీ చెప్పి పువ్వును పోలీసులకు అప్పగించడంతో దుకాణం సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కూడా ఆ మహిళకు తెలియక ఆ పువ్వు తీసుకెళ్లిందనే కారణంతో ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఇదంతా చదివాక.. వార్నీ పూలల్లో కూడా ఇంత విలువైన పూలు ఉంటాయాని ఆశ్చర్యపోవడం మన వంతు!

English summary
A woman in China, who switched a flower she had bought with another item on display at a Taiwanese flower shop thinking it was the same price, inadvertently took home a rare flower that could be worth 20 million yuan ($3 million). Workers at the flower market in Yucheng went into a total panic after the store’s rare type of Iris japonica (butterfly flower) suddenly went missing. The flower, which has been carefully cultivated over the past eight years, was the only one of its kind that they had left at the shop. According to Shanghaiist, the nursery was planning to use that iris to grow more of the plant to meet growing international demand.The nursery reportedly has orders from 10 different countries which supposedly amount to around 20 million yuan ($3 million). With the flower missing, the orders were at risk of being canceled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X