Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాక్ భూభాగం పై ఉన్న ఉగ్రసంస్థలను ఏరిపారేస్తాం, దాడులు జరగనివ్వం: ఇమ్రాన్ ఖాన్

విదేశాల్లో పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రదాడులు జరపడాన్ని ఎంతమాత్రం సహించబోమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇస్లామ్ మిలిటెంట్ సంస్థలను ఏరిపారేయాలని పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇమ్రాన్‌ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద సంస్థలను ఏరిపారేయాలని ప్రపంచదేశాల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ చర్యలకు ఉపక్రమించారు. పుల్వామా దాడుల తర్వాత ఈ ఒత్తిడి మరింత ఎక్కువైంది.

ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై పాకిస్తాన్ గడ్డపై ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఆ తర్వాత భారత వైమానిక దళం పాక్ గగనతలంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేసింది. అనంతరం పాకిస్తాన్ కూడా భారత మిలటరీ స్థావరాలపై దాడి చేయాలని భావించినప్పటికీ మన వైమానిక బృందాలు తరిమి కొట్టాయి. ఈ క్రమంలోనే అమెరికా, బ్రిటన్‌తో సహా పలు ప్రపంచదేశాలు పాక్‌ నుంచి ఆపరేట్ చేస్తున్న ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వాన్ని కోరాయి.

Won’t allow militant groups in Pakistan, carry out attacks abroad: Imran Khan

ఇదిలా ఉంటే భారత బలగాలపై దాడులకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను వినియోగిస్తుందనేది చరిత్ర తిరిగేస్తే తెలుస్తుందని భారత్ చెబుతోంది. అయితే భారత్ ఆరోపణలను పాకిస్తాన్ కొట్టిపారేస్తూ వచ్చింది. ఆ తర్వాత సోమవారం రోజున ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకుంటున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే గురువారం 182 మతపరమైన పాఠశాలలను పాకిస్తాన్ మూసివేయించింది. ఈ పాఠశాలలను నిషేధిత సంస్థలు నడుపుతున్నాయి. ఇక దీనికి సంబంధించి 120 మందిని కూడా పాక్ అధికారులు అరెస్టు చేశారు. విదేశాల్లో దాడులు జరిపేందుకు పాకిస్తాన్ భూమి వేదిక కాకూడదని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదని ఖాన్ ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ చెప్పారు. ఇక పాకిస్తాన్‌లో కొత్త శఖం ప్రారంభమైందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలు కంటితుడుపు చర్యలుగా భారత్ అభివర్ణించింది. పాకిస్తాన్‌ ఓ శాంతియుత దేశంగా ప్రపంచదేశాల సరసన నిలబడాలని ఇమ్రాన్ ఖాన్ ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద సంస్థలను ఏరిపారేయాలన్నది గత కొంతకాలంగా తాము రచించిన వ్యూహంలో భాగమే అని ... భారత్ చెబుతోంది కాబట్టి ఈ దాడులు చేయడం లేదని పాకిస్తాన్ అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+