వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వండర్ కిడ్స్: మీ పిల్లల్లో ఉన్న అసాధారణ ప్రతిభా పాటవాలు ఉన్నాయని గుర్తించడమెలా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నికోల్

కొంత మంది పిల్లలకు అసాధారణ ప్రతిభ ఉండటాన్ని చూస్తూ ఉంటాం. అయితే, వీరి ప్రతిభ పట్ల వివాదాస్పద అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. సాధారణ స్థాయిని మించి ఐక్యూ ఉన్న పిల్లలను ప్రత్యేక సామర్ధ్యం ఉన్న పిల్లలని న్యూరో శాస్త్రవేత్తలు, మానసిక నిపుణులు చెబుతారు.

మరో వైపు ఎడ్యుకేషన్ కౌన్సిలర్లు, స్పోర్ట్స్ కోచ్ లు ఈ ప్రతిభ పరిధిని చాలా విస్తృతమైనదిగా చూస్తారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారంతా ఆయా రంగాల్లో ప్రతిభ కలిగిన వారేనని అంటారు.

కానీ, తెలివితేటలను అంచనా వేసే ఐక్యూ పరీక్షలో స్కోర్ 97 శాతానికి పైగా సాధిస్తే వారిని ప్రత్యేక సామర్ధ్యం ఉన్నట్లుగా పరిగణిస్తారు.

బ్రెజిల్ లో సావో పాలోకు చెందిన థియో కోస్టా రిబియెరోకు ప్రత్యేక సామర్ధ్యాలున్నాయి. ఆరు నెలల వయసులోనే మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏడాది వయసు వచ్చేసరికి వ్యాక్యాలు పూర్తిగా మాట్లాడటం మొదలయింది. అప్పుడే ప్రీ-స్కూల్ లో కూడా చేర్చారు.

"ఒక అక్షరం చూసి ప్రతీ అక్షరాన్ని వివరించమని అడిగేవాడు" అని థియో తండ్రి గోర్ రిబియెరో చెప్పారు.

అయితే, థియో అక్షరాలను నేర్చుకోవాలని ఇంట్లో ఎటువంటి ఒత్తిడి పెట్టలేదని చెప్పారు. కానీ, చిన్నారి చూపిస్తున్న ఉత్సాహాన్ని కూడా నిర్లక్ష్యం చేయలేదని చెప్పారు.

మహమ్మారి సమయంలో పిల్లలు అక్షరాలు నేర్చుకుంటున్న సమయానికి మూడేళ్ళ థియో చదవడం, రాయడం, లెక్కలు చేయడం కూడా చేస్తున్నారు.

గత ఏడాది జులైలో థియో స్కూలుకు వెళ్లడం మొదలుపెట్టారు. స్కూలు టీచర్లు తల్లితండ్రులతో నిర్వహించిన సమావేశంలో ఈ అబ్బాయి సామర్ధ్యం అసాధారణంగా ఉందని చెప్పి, ఇంటెలిజెన్స్ టెస్ట్ చేయించమని సూచించారు.

"ఆ తర్వాత మేము న్యూరో సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లి ఇంటెలిజెన్స్ టెస్ట్ చేయించాం. మానసిక స్థాయి కూడా పరీక్ష చేయించాం. థియో తెలివితేటలు అసాధారణం అని నివేదిక ఇచ్చారు. ఇవి కేవలం మాయలా వచ్చినవి కావని చెప్పారు".

చిన్న పిల్లల్లో టీనేజీ లక్షణాలు

థియో తెలివితేటలు 14 - 15 ఏళ్ల వాళ్ళకుండే తెలివితేటలతో సమానంగా ఉన్నాయి. అప్పటికి ఆ అబ్బాయి వయసు 5 సంవత్సరాలు.

ప్రస్తుతం ఒక ప్రైవేటు స్కూలులో రెండవ తరగతి చదువుతున్నాడు.

"థియో ఒకటవ తరగతి చదవలేదు. వచ్చే ఏడాది నేరుగా నాల్గవ తరగతిలో చేర్చవచ్చేమో చూస్తాం" అని రిబియెరో చెప్పారు.

"ఈ అబ్బాయి సాధారణ పిల్లల మాదిరిగానే ఉంటాడు. స్నేహితులతో గడపడం, ఆడుకోవడం అంటే ఆసక్తి చూపిస్తాడు. డైనోసార్లు అంటే ప్రత్యేక ఆసక్తితో ఒక యూ ట్యూబ్ చానెల్ కూడా మొదలుపెట్టారు" అని చెప్పారు.

"ఇలా డైనోసార్లతో ఆడుకోవాలి, కార్టూన్లు చూడాలనే ఈ ఆరేళ్ళ పిల్లాడు ఒకేసారి యుక్తవయసు అబ్బాయిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. వెంటనే తత్వశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నను వేస్తారు" అని చెప్పారు.

థియో

"పిల్లలెలా పుడతారు, జెనెటిక్ కోడ్ అంటే ఏంటి, పిల్లల రంగు ఎందుకు తేడాగా ఉంటుంది లాంటి విషయాలను ఇప్పటికే వివరించి చెప్పాల్సి వచ్చింది. తిను బాల్యం, యుక్త వయసు కలిసిన అబ్బాయి" అని అన్నారు.

థియో ఈ ఏడాది ఫిబ్రవరిలో మెన్సా ఇంటర్నేషనల్ లో చేరిన అత్యంత చిన్న వయసు వ్యక్తిగా నిలిచారు. ఈ సొసైటీలో అత్యధిక ఐక్యూ ఉన్నవారు సభ్యులుగా ఉంటారు.

స్కూలుకు వెళ్లడంతో పాటు ఈ చిన్నారి సాకర్, మ్యూజిక్ తరగతులకు కూడా హాజరవుతారు.

"అయితే, ఇలాంటి పిల్లలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. ఉదాహరణకు థియో ఒకటవ తరగతి చదవకుండా ఉండేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. ఇలాంటి పిల్లల పురోగతిని విద్యా వ్యవస్థే నిరోధిస్తోంది" అని రిబియెరో అన్నారు.

ఈ విషయం గురించి బ్రెజిల్ విద్యా మంత్రిత్వ శాఖను చాలా సార్లు ఈ మెయిల్, ఫోన్ ద్వారా సంప్రదించాం. అయితే, ఇప్పటి వరకు వారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లభించలేదని చెప్పారు.

"చట్టరీత్యా పిల్లలకున్న హక్కులను సాధించుకోవడానికి ప్రభుత్వాన్ని ఆశ్రయించక ముందే స్కూలు పిల్లల నైపుణ్యాన్ని పెంచేందుకు చొరవ తీసుకుంటే పిల్లల పురోగతికి అవకాశాలు కల్పించినట్లు అవుతుంది" అని అన్నారు.

నికోల్

నికోల్

8 ఏళ్ల నికోల్ ఆరు నెలల వయసులోనే నాన్న అని పిలవడం మొదలుపెట్టింది. ఏడాది వచ్చేసరికి బొమ్మలతో బదులు కాగితం, పెన్ తో ఆడటం మొదలుపెట్టింది. ఇది విభిన్నంగా ఉందని చాలా మంది అన్నారు కానీ, తల్లిగా నేనలా భావిస్తున్నానేమో అని అనుకున్నాను" అని నికోల్ తల్లి చెప్పారు.

"కానీ, రెండేళ్లు వచ్చేసరికి తను పాటలు పాడటం, కిండర్ గార్డెన్ స్కూలుకు వెళ్లడం మొదలైంది. మిగిలిన పిల్లల కంటే అన్నిట్లో ముందంజలో ఉందని స్కూలు నుంచి కబురు వచ్చింది".

రియో డీ జీనియెరోలో ఒక ఫెడరల్ స్కూల్ లో చేరేందుకు 2500 మంది పోటీ పడితే, సీటు పొందిన 149 మందిలో నికోల్ కూడా ఉన్నారు. అప్పటికి తన వయసు ఏడేళ్లు.

అప్పుడే ఆమెకు ఐక్యూ టెస్ట్ చేయించారు. "అప్పటి వరకు తనకు ప్రత్యేక సామర్ధ్యం ఉందని మాకర్థం కాలేదు" అని నికోల్ తల్లి చెప్పారు.

నికోల్ ప్రస్తుతం మూడవ తరగతి చదువుతున్నారు. అయితే, తనను నాల్గవ తరగతి కాకుండా పై తరగతులకు పంపించాలని ఆమె తల్లితండ్రులు ఆలోచిస్తున్నారు.

నికోల్ డాక్టర్ కావాలని కలలు కంటున్నారు. ఆమెకు గణితం అంటే కూడా విపరీతమైన మక్కువ.

"ఒక రోజు చర్చిలో ఉన్నప్పుడు పక్కనే ఉన్న అమ్మాయి చేస్తున్న గణితాన్ని చూసి ఇంటికి వచ్చి అదే లెక్కలను సులభంగా చేసేసింది" అని ఆమె తల్లి చెప్పారు.

"ఆమె కీ బోర్డు కూడా నేర్చుకుని, సొంతంగా పాటను వాయించేస్తోంది" అని చెప్పారు.

"చాలా త్వరగా స్నేహితులను చేసుకుని ఎటువంటి వాతావరణంలోనైనా ఇమిడిపోతుంది" అని చెప్పారు.

ఈ చిన్నారి కూడా మెన్సా బ్రెజిల్ లో సభ్యురాలిగా ఉంది.

"తాను సాధారణ వ్యక్తినేనని చెబుతూ ఉంటుంది" అని ఆమె తల్లి చెప్పారు.

ప్రత్యేక ప్రతిభ ఉన్న పిల్లలను గుర్తించడమెలా?

కొన్ని ఐక్యూ పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే పిల్లల్లో సామర్ధ్యాన్ని గుర్తించగలరు. వీటిని మానసిక నిపుణులు, నరాల నిపుణులు, మానసిక కౌన్సిలర్లు కలిపి చేస్తారు.

బ్రెజిల్ స్పెషల్ ఎడ్యుకేషన్ కేంద్రం ప్రత్యేక సామర్ధ్యం ఉన్న పిల్లల్లో ఉండే లక్షణాలను పొందుపరిచింది

  • తీవ్రమైన ఉత్సుకత
  • వయసుకు మించిన మాటలు
  • సులభంగా నేర్చుకునే సామర్ధ్యం.
  • తెలివితేటలు
  • విషయాన్ని అర్ధం చేసుకునే పరిజ్ఞానం
  • నాయకత్వ లక్షణాలు, ఆత్మ విశ్వాసం
  • జ్ఞాపకశక్తి
  • సృజనాత్మకత
  • ఆలోచన చేయగలిగే సామర్ధ్యం
  • లోతైన పరిశీలనలు
  • లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుదల

ఈ సామర్ధ్యాన్ని చిన్న వయసులో గుర్తించకపోతే, స్కూలులో సమస్యలు రావచ్చు.

"చాలా మంది సామర్ధ్యం ఉన్న పిల్లలు కూడా స్కూలులో మంచి మార్కులు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. సాధారణ చదువులో వీరికి ఆసక్తి ఉండదు" అని నిపుణులు చెబుతున్నారు.

క్రీడలు, కళలు, చదువులో అసాధారణ ప్రతిభ: ఇదంతా ప్రత్యేక సామర్ధ్యం వల్లేనా?

సాధారణంగా ప్రత్యేక సామర్ధ్యం ఉన్న పిల్లలను బ్రెజిలియన్ కౌన్సిల్ ఆఫ్ గిఫ్ట్డ్నెస్ రెండు రకాలుగా విభజించింది.

"మొదటి వర్గం వారు చదువులో అసాధారణ ప్రతిభ చూపించి మంచి మార్కులు సంపాదిస్తారు. రెండవ రకం వారు సృజనాత్మకంగా ఉంటారు".

నికోల్

కొంత మంది పిల్లలకు అసాధారణ ప్రతిభ ఎందుకుంటుంది?

కొంత మంది పిల్లలకు మెదడులోని 'గ్రే మ్యాటర్' శాతం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల వీరు విషయాన్ని తొందరగా అర్ధం చేసుకోగలరు. వీరి మెదడు చురుకుగా పని చేస్తుంది. ఇది మెదడులోని ఫ్రంటల్ కార్టెక్స్‌ను ప్రభావితం చేసి, ఆలోచనా సరళి పై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు.

అసాధారణ ప్రతిభ ఉన్న వారి బ్రెయిన్ భిన్నంగా ఉంటుంది. వీరికి మేధస్సు బాగా ఉంటుంది. వీళ్లకు పటిష్టమైన దీర్ఘ కాల న్యూరాన్లు ఉంటాయి. మెదడులో నిర్ణయాత్మక శక్తికి, లాజిక్ కు, దేనినైనా నిరోధించడానికి, జ్ఞాపకశక్తికి, ఏకాగ్రతకు అవసరమైన ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ వల్ల ఇది సాధ్యమవుతుంది.

ఇలాంటి పిల్లల మెదడు పరిమాణం కూడా మిగిలిన వారితో పోలిస్తే భిన్నంగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెప్పాయి.

"ఇది నరాలకు సంబంధించిన అస్తవ్యస్తత లేదా ఆరోగ్యానికి సంబంధించిన అంశం కాదని మెన్సా బ్రెజిల్ సూపర్‌వైజర్ చెబుతున్నారు. ఇది ఒక మానసిక అంశం" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Wonder Kids: How to recognize your child's extraordinary talents?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X