Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రష్యా భారీ షాక్ : పుతిన్‌కు డబ్యూఈఎఫ్ ఝలక్.. దావోస్‌లో నో ఎంట్రీ..!!

ఉక్రెయిన్‌ పై రష్యా భీకర దాడులను కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధానికి ముగింపు పలకాలంటూ.. ప్రపంచదేశాలు పిలుపు ఇస్తున్నాయి. అటు అమెరికా, యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించి ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనుకడుగు వేయడంలేదు. ఉక్రెయిన్‌పై మరింత రెచ్చిపోయి వైమానిక దాడులకు దిగారు. తాజాగా మరియుపోల్‌లో మాస్కో సేనలు బాంబుల విసిరాయి. ఈ దాడుల్లో చిన్న పిల్లల ఆప్పత్రి ధ్వంసమైందని ఉక్రెయిన్ వెల్లడించింది. నగరంలో రష్యా బలగాలు విధ్వంసానికి పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

Recommended Video

    Russia Ukraine Conflict : మా దేశంపై ఆంక్షలు విధిస్తే నష్టపోయేది మీరే! - Putin | Oneindia Telugu

    ఆస్ప‌త్రిపై ర‌ష్యా సేన‌లు దాడులు


    రష్యా దాడులకు సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తన ట్విట్లర్‌లో షేర్ చేశారు. మరియుపోల్‌లోని మెటర్నిటీ ఆస్పతిపై రష్యన్ సేన‌ల దాడులను ప్రత్యక్షంగా చూడండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శిథిలాల కింద పౌరులు, చిన్నారులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణాన్ని , బీభత్సాన్ని పట్టించుకోకుండా ఈ ప్రపంచం ఇంకా ఎంత కాలం రష్యాకు సహకరిస్తుందని ప్రశ్నించారు. తమ గగనతలాన్ని మూసివేయండి. ఈ దురాక్రమణ చర్యలను ఆపండి. యూరప్ దేశాలు మానవత్వాన్ని కోల్పోతున్నట్లు ఉన్నాయని పేర్కొన్నారు. రష్యాపై చర్యలు తీసుకోవడంలో భయపడుతున్నారని మండిపడ్డారు.

    ర‌ష్యాకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఝలక్

    ర‌ష్యాకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఝలక్


    ఉక్రెయిన్‌పై భీకర దాడుల నేపథ్యంలో రష్యాకు ఆంక్షల పరంపరం కొనసాగుతోతంది. అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. ఆర్థికంగా దెబ్బతీసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. తాజాగా రష్యాకు పెద్ద షాక్ తగిలింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఝలక్ ఇచ్చింది. రష్యాకు చెందిన సంస్థలతో ఉన్న సంబంధాలను స్తంభింపజేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఆంక్షల జాబితాలో ఉన్న వారికి దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశానికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

    అణువిద్యుత్ ప్లాంట్‌పై భ‌యాలు

    అణువిద్యుత్ ప్లాంట్‌పై భ‌యాలు


    మరోవైపు చెర్నోబిల్ అణువిద్యుత్ ప్లాంట్‌పై ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కీలక వ్యాఖ్యలు చేసింది.. రష్యా సేనలు చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా తేలియడంలేదని పేర్కొంది. అణువిద్యుత్ ప్లాంట్‌లో సంబంధాలు తెగిపోయినట్లు తెలిపింది. అక్కడ ఉన్న సిబ్బంది పరిస్థితిపై కూడా సమాచారం లేదని వెల్లడించింది. అక్కడ 210 మందికి సరిపడా ఆహారం, మందులు ఉన్నప్పటకీ .. పరిస్థితి విషమిస్తోందని ప్రకటించింది.

     టర్కీ వేదికగా త‌దుప‌రి శాంతి చ‌ర్చ‌లు

    టర్కీ వేదికగా త‌దుప‌రి శాంతి చ‌ర్చ‌లు


    అటు రష్యా, ఉక్రెయిన్ దేశాల విదేశాంగ మంత్రులు టర్కీ వేదికగా గురువారం సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో చర్చలు ఫలించే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.. యుద్ధానికి ముగింపు పలకాలని కోరుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా త‌దుప‌రి శాంతి చ‌ర్చ‌ల‌కు తాము సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు.రష్యా కాల్పులు విరమింపజేసేలా ప్ర‌పంచ దేశాలు ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+