వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖతార్ ఎయిర్‌వేస్ రికార్డు: డైరెక్ట్ ప్లైట్ సర్వీసు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

దోహ: ఖతార్ ఎయిర్‌వేస్ ఓ సరికొత్త ట్రావెల్ రికార్డుకి శ్రీకారం చుట్టింది. ఒకే విమానంలో సుదీర్ఘ ప్రయాణం చేసే డైరెక్ట్ ప్లైట్ సర్వీసుని ఖతార్ ఎయిర్‌వేస్ ప్రారంభిస్తున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అక్బర్ బకర్ వెల్లడించారు. ఖతార్ రాజధాని దోహ నుంచి న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కి ఈ విమాన సర్వీసుని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఈ విమానం ప్రయాణం ఐదు, పది గంటలు కాదు.. ఏకంగా 18 గంటల పాటు నిరంతరాయంగా సాగుతుంది. దోహ నుంచి న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు ఈ డైరెక్ట్‌ ఫ్లైట్‌లో ప్రయాణానికి 18 గంటల 34 నిమిషాల సమయం పడుతుంది. ప్రయాణించే దూరం 9,034 మైళ్లు.

కాగా, ఇప్పటి వరకు ప్రపంచంలో అతి సుదీర్ఘమైన ప్రయాణం అమెరికాలోని డల్లస్‌ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీల మధ్య తిరుగుతోంది. ఈ ప్రయాణ సమయం 16 గంటల 55 నిమిషాలు. ప్రయాణించే దూరం 8,578 మైళ్లు. ఈ రికార్డు ప్రయాణాన్ని బ్రేక్‌ చేస్తూ తాజాగా ఖతార్‌ ఎయిర్‌వేస్‌ ఈ సరికొత్త నాన్‌స్టాప్‌ విమానాన్ని ప్రారంభించనుంది.

మార్చి 31న ఎమిరేట్స్ కూడా దుబాయ్ నుంచి పనామా సిటీకి కొత్త సర్వీస్‌ని ప్రారంభించనుంది. ఈ ప్రయాణానికి 17 గంటల 41 నిమిషాల సమయం పడనుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ కూడా 2018లో తిరిగి న్యూయార్క్ నుంచి సింగపూర్‌కు డైరెక్ట్ ప్లైట్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉంది.

న్యూయార్క్ నుంచి సింగపూర్ మధ్య గల దూరం 9,535 మైళ్లు. ఈ సర్వీసు గనుక అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణ సమయం 18 గంటల 50 నిమిషాల పట్టనుంది.

World's longest flight route: Qatar plans Doha to Auckland direct flights

ప్రపంచంలో సుదీర్ఘ ప్రయాణం చేసే ప్లైట్స్:
డల్లాస్-సిడ్నీ, క్వాంటాస్ - 8.578 మైళ్ళు (16h 55m)
జొహ్యానెస్బర్గ్-అట్లాంటా - డెల్టా, 8.439 మైళ్ళు (16h 40m)
అబూ ధాబీ లాస్ ఏంజిల్స్ - ఎతిహాద్ 8.390 మైళ్ళు (16h 30m)
దుబాయ్కి లాస్ ఏంజిల్స్ - ఎమిరేట్స్, 8.339 మైళ్ళు (16h 35m)
జెడ లాస్ ఏంజిల్స్ - సౌదీ, 8.332 మైళ్ళు (16h 55m)
దోహా లాస్ ఏంజిల్స్ - కతార్ ఎయిర్వేస్, 8.306 మైళ్ళు (16h 25m)
దుబాయ్ హుస్టన్ - ఎమిరేట్స్, 8.168 మైళ్ళు (16h 20m)
అబూ ధాబీ-శాన్ ఫ్రాన్సిస్కో - ఎతిహాద్, 8.158 మైళ్ళు (16h 15m)
డల్లాస్ హాంగ్ కాంగ్ - అమెరికన్ ఎయిర్లైన్స్, 8.123 మైళ్ళు (16h 20m)
దుబాయ్కి శాన్ ఫ్రాన్సిస్కో - ఎమిరేట్స్, 8.103 మైళ్ళు (15h 50m)

English summary
Qatar Airways chief executive Akbar Al Baker said the carrier would add ultra-long haul routes with new flights to Auckland using Boeing 777-LR aircraft, Bloomberg Business reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X