14,535 కిలోమీటర్లు... 16 గంటల 23 నిమిషాలు... విమానంలో నాన్ స్టాప్ గా
ఖతార్ లోని దోహా నుంచి బయలుదేరిన ఓ విమానం 14,535 కిలోమీటర్లు ప్రయాణించి న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ కు చేరుకుని ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ప్రయాణం చేసిన విమానంగా చరిత్ర సృష్టించింది.
వెల్లింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన విమాన ప్రయాణం చేసిన ఖతార్ ఎయిర్ వేస్ విమానం సోమవారం న్యూజిలాండ్ చేరుకుంది. ఖతార్ లోని దోహా నుంచి బయలుదేరిన ఈ విమానం 14,535 కిలోమీటర్లు ప్రయాణించి న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ కు చేరుకుని చరిత్ర సృష్టించింది.
16 గంటల 23 నిమిషాలు నాన్ స్టాప్ గా ప్రయాణించిన ఈ విమానం అనుకున్న సమయం కంటే అయిదు నిమిషాల ముందే ఆక్లాండ్ కు చేరుకున్నట్లు ఖతార్ ఎయిర్ వేస్ తెలిపింది. లాంగ్ రేంజ్ బోయింగ్ 777-200ఎల్ఆర్ విమానం ఈ ప్రయాణ సమయంలో 10 టైమ్ జోన్లు దాటింది.

విమానంలో నలుగురు పైలట్లు, 15 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సిబ్బంది 1100 కప్పుల టీ, కాఫీ, 2 వేల కూల్ డ్రింక్స్, 1036 మీల్స్ సర్వ్ చేశారు. గత ఏడాది మార్చిలో ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ ప్రయాణం చేసే నాన్ స్టాప్ కమర్షియల్ విమానంగా దుబాయి నుంచి ఆక్లండ్ కు సర్వీసును మొదలెట్టింది. వీటి మధ్య దూరం 14,200 కిలోమీటర్లు.
మన ఎయిర్ ఇండియా కూడా ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్ కో వరకు నాన్ స్టాప్ విమానం నడుపుతోంది. అయితే ఖతార్ ఎయిర్ వేస్ దోహా-ఆక్లాండ్ సర్వీసుతో వీటిని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ విమాన ప్రయాణంగా రికార్డు సృష్టించింది.












Click it and Unblock the Notifications