వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2020: అత్యంత వివాదాస్పద ఎన్నికలుగా: ఒక్క టర్మ్‌లోనే ఓడిన అధ్యక్షుడిగా మిగిలిన ట్రంప్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఈ ఏడాది..అమెరికా చరిత్రలో అత్యంత వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల్లో ఒకటిగా నిలిచింది. ఓట్ల లెక్కింపుల్లో అనేక అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ డొనాల్డ్ ట్రంప్ న్యాయస్థానాల గడప తొక్కేలా చేశాయి. అత్యంత కీలకమైన ఆరు రాష్ట్రాల్లో చివరివరకూ ఆధిక్యతలో కనిపించిన డొనాల్డ్ ట్రంప్.. చివరి రౌండ్‌లో వెనకడుగు వేశారు. మెజారిటీ రాష్ట్రాలను కోల్పోయారు. ఫలితంగా- ఒక్క టర్మ్‌తోనే అమెరికా అధ్యక్ష పదవిని సరిపెట్టుకున్న అధ్యక్షుల జాబితాలో చేరారు. ఇప్పటికీ ఆయన తన ఓటమిని అంగీకరించకపోవడం మరో ఎత్తు.

పట్టువదలని విక్రమార్కుడిలా ట్రంప్: ఎన్నికల ఫిక్సింగ్: జార్జియా గవర్నర్‌కు ఫోన్‌: కలకలంపట్టువదలని విక్రమార్కుడిలా ట్రంప్: ఎన్నికల ఫిక్సింగ్: జార్జియా గవర్నర్‌కు ఫోన్‌: కలకలం

 270కి చేరుకోలేక..

270కి చేరుకోలేక..

ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలను నిర్వహించారు. అధికారాన్ని అందుకోవడానికి 270 సీట్లను సంపాదించాల్సి ఉండగా.. ఈ రేస్‌లో డొనాల్డ్ ట్రంప్ వెనుకంజ వేశారు. 232 స్థానాల వద్దే ఆగిపోయారు. అమెరికన్లు డెమొక్రాట్లకే జేేజేలు పలికారు. ఆ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ను గెలిపించారు. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ ఘన విజయాన్ని అందుకున్నారు. డెమొక్రాట్లకు 306 స్థానాలు దక్కాయి. మూడు రోజుల పాటు తీవ్ర ఉత్కంఠతకు గురి చేసిన ఈ ఎన్నికల్లో విజయం డెమొక్రాట్లను వరించింది. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నికయ్యారు.

వరుసగా రెండోసారి గెలవలేక..

వరుసగా రెండోసారి గెలవలేక..

అమెరికా వంటి అగ్రరాజ్యానికి అధినాయకత్వాన్ని వహించడం అంటే గొప్ప విషయం. వరుసగా రెండోసారి అగ్రదేశం పీఠాన్ని అధిష్టించే అవకాశాన్ని డొనాల్డ్ ట్రంప్ కోల్పోయారు. పెన్సిల్వేనియాలో మెజారిటీ ఓట్లను సాధించడంతో జో బిడెన్‌ అధ్యక్ష పీఠానికి దగ్గర అయ్యారు. జార్జియా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్, మిచిగాన్ వంటి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠతకు గురి చేసింది. చివరి నిమిషం వరకూ కొనసాగింది. ఆయా రాష్ట్రాల్లో తొలుత భారీ తేడాతో ఆధిక్యతను కనపరిచిన డొనాల్డ్ ట్రంప్.. చివరికి ఓడిపోవడమే వివాదాలకు కారణమైంది. ఒక్క శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో డొనాల్డ్ ట్రంప్ కీలక రాష్ట్రాలను ప్రత్యర్థికి సమర్పించుకోవాల్సి వచ్చింది.

ఎన్నికల నిర్వహణపై ఘాటు వ్యాఖ్యలు..

ఎన్నికల నిర్వహణపై ఘాటు వ్యాఖ్యలు..

ప్రజల అభిప్రాయాలు, వారి ఓట్లతో సంబంధం లేకుండా డెమొక్రాట్లను గెలిపించాలని ముందే నిర్ణయించుకున్నారంటూ డొనాల్డ ట్రంప్ విమర్శించారు. బ్యాలెట్ల లెక్కింపులో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని పునరుద్ఘాటించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను సైతం తాము అందజేసినపప్పటికీ.. న్యాయస్థానాలు పట్టించుకోలేదని చెప్పారు. బ్యాలెట్ సిగ్నేచర్లపై ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. పెన్సిల్వేనియా, జార్జియా, విస్కాన్సిన్, అరిజోనా వంటి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును మళ్లీ చేపట్టడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.

న్యాయం జరగలేదంటూ

న్యాయం జరగలేదంటూ


ఎన్నికల్లో చోటు చేసుకున్న మోసాలకు తగిన సాక్ష్యాధారాలను తన లీగల్ టీమ్ సేకరించిందని, వాటిని సుప్రీంకోర్టుకు అందజేసిందని చెప్పారు. తాము దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీంకోర్టు విచారిస్తుందనే విశ్వాసం కలగట్లేదని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. తాము వేసిన పిటీషన్లన్నింటినీ న్యాయస్థానాలు తోసిపుచ్చుతున్నాయని, పెన్సిల్వేనియా న్యాయస్థానంలోనూ తిరస్కరణకు గురైన విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన మద్దతుదారులు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించడానికి న్యాయమూర్తులు సుముఖంగా లేరని ఆరోపించారు.

English summary
Year Ender 2020: US President Donald Trump defeat in Most controversial US elections 2020. Democratic Candidate Joe Biden elect as new president of US this year and first Asian woman Kamala Harris elect as Vice President of US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X