మెమెన్‌ని ఉరితీసింది ఆ తలారే! కూతుర్ని కలవకుండా
ముంబై: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమెన్‌కు గురువారం ఉదయం నాగపూర్ కేంద్ర కారాగారంలో ఉరిశిక్షను అమలు చేశారు. 257 మంది మృతికి ఇతడు కూడా కారణం. అయితే, మెమెన్‌ను ఉరి తీసింది అజ్మల్ కసబ్‌ను ముంబైలోని ఎరవాడ జైలులో ఉరి తీసిన తలారే.
అయితే, భద్రతా కారణాల వల్ల ఉరి తీసిన వ్యక్తి పేరు వెల్లడించలేదు. మెమెన్‌కు ఉరి కోసం పుణేలోని ఎరవాడ జైలు నుంచి 20 మంది సిబ్బంది వచ్చారు. అందులో అతను కూడా ఉన్నారు. ఆయనతో పాటు మరొక కానిస్టేబుల్ కూడా వారం రోజుల క్రితం నాగపూర్ వచ్చారు. శిక్షణ ఇప్పించారు.

యాకూబ్ మెమెన్ చివరి కోరిక తీరలేదు. చనిపోయే ముందు తన కూతురు జుబేదియాను చూడాలని ఉందని మెమెన్ తన చివరి కోరికను జైలు అధికారులకు చెప్పాడు. జైలు వద్దకు అతడి కుటుంబ సభ్యులు వచ్చారు. అయితే, అతని కూతురు మాత్రం రాలేదు.
వాస్తవానికి జైలు వద్దకు యాకూబ్ సోదరులు మాత్రమే వచ్చారు. అతడి కూతురు ముంబైలోనే ఉండిపోయింది. అనివార్య కారణాల వల్ల జుబేదియాను చూసే అవకాశం యాకుబ్ మెమెన్‌కు కలగలేదు. ఆమెతో ఫోనులో మాత్రం మాట్లాడే అవకాశాన్ని జైలు అధికారులు కల్పించారు.












Click it and Unblock the Notifications