ఏఐ అంటే అమెరికన్ ఇండియన్స్: యూఎస్‌లో ఎన్నారైల సభలో మోడీ
న్యూయార్క్: ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ దేశానికి బలమైన బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూయార్క్ వేదికగా నిర్వహించిన 'మోడీ & యూఎస్- ప్రోగ్రెస్ టుగెదర్' అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికాలోని భారతీయుల నైపుణ్యాలు, నిబద్ధత సాటిలేనివని కితాబిచ్చారు. ఇరు దేశాల మధ్య ప్రవాసులు వారధులని అన్నారు.
Glad to have met Quad Leaders during today’s Summit in Wilmington, Delaware. The discussions were fruitful, focusing on how Quad can keep working to further global good. We will keep working together in key sectors like healthcare, technology, climate change and capacity… pic.twitter.com/xVRlg9RYaF
— Narendra Modi (@narendramodi) September 22, 2024
ప్రవాస భారతీయులు ఇరుదేశాలను అనుసంధానించినట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. అంతేగాక, ఏఐ అంటే కొత్త నిర్వచనం చెప్పారు. ఏఐ అంటే అమెరికాన్ ఇండియన్స్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు భారత్ అవకాశాల గని అని చెప్పారు. అవకాశాల కోసం ఎదురుచూసే కాలం పోయిందన్నారు. కాగా, గతంలో తాను ఎటువంటి పదవుల్లో లేని సమయంలోనే అమెరికాలోని దాదాపు 29 రాష్ట్రాల్లో పర్యటించినట్లు ప్రధాని మోడీ గుర్తుచేసుకున్నారు. ప్రధానిగా అమెరికా పర్యటనల్లో భాగంగా ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించిన కార్యక్రమాలను ప్రస్తావించారు. ఇక్కడి భారతీయులు ప్రతిసారీ పాత రికార్డులను చెరిపేశారన్నారు.

ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్‌ఏ(IACU) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రోగ్రాంకు ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు దేవీశ్రీ ప్రసాద్ తదితరులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రధాని మోడీ సెప్టెంబర్ 23న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'నుద్దేశించి ప్రసంగించనున్నారు.
#WATCH | Modi&US Event | PM Narendra Modi says, "You have connected India to America and America to India. Your skill, talent, and commitment have no competition. You might have come seven seas apart, but no sea has that much depth that it can distance you from India. What Ma… pic.twitter.com/u6roTZGagk
— ANI (@ANI) September 22, 2024
అంతకుముందు, అమెరికా పర్యటనలో భాగంగా తొలుత ఫిలాడెల్ఫియా విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం దక్కింది. విమానాశ్రయం వెలుపల ప్రవాస భారతీయులతో ప్రధాని మోడీ సంభాషించారు. తరువాత డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లోని హోటల్ డుపాంట్‌లోనూ ప్రవాస భారతీయులతో మోడీ మాట్లాడారు. అక్కడ ప్రదర్శించిన 'గర్బా'ను ప్రధాని వీక్షించారు.
VIDEO | PM Modi (@narendramodi) welcomed by music artists Hanumankind, Aditya Gadhvi and Devi Sri Prasad (@ThisIsDSP) onstage at the Community Event at Nassau Coliseum in New York earlier today. #PMModiUSVisit
— Press Trust of India (@PTI_News) September 22, 2024
(Source: Third Party) pic.twitter.com/thZKkxDEw2
మరోవైపు, క్వాడ్ సదస్సు నిమిత్తం అమెరికా వెళ్లిన ప్రధాని మోడీ, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. బైడెన్‌తో జరిగిన సమావేశంలో ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించినట్టు మోడీ తెలిపారు. చర్చలు ఫలప్రదమైనట్టు భేటీ అనంతరం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. డెలావేర్‌లోని గ్రీన్‌విల్లేలోని బైడెన్ నివాసంలో తనకు ఆతిథ్యమిచ్చినందుకు మోడీ ధన్యవాదాలు తెలిపారు.
The warmth and energy of the Indian diaspora in New York is unparalleled. Addressing a community programme. Do watch! https://t.co/ttabGnATaD
— Narendra Modi (@narendramodi) September 22, 2024
భారత్‌తో అమెరికా భాగస్వామ్యం చరిత్రలో ఎప్పుడూ లేనంత బలమైంది, సన్నిహితమైంది, చైతన్యవంతమైందని బైడెన్ చెప్పారు. ప్రధాని మోడీ, తాను చర్చలకు కూర్చున్న ప్రతిసారీ కొత్త సహకార రంగాలను కనుగొనగల ఇరు దేశాల సామర్థ్యాన్ని చూసి తాను ఆశ్చర్యపోతున్నట్టు ఎక్స్‌లో పేర్కొన్నారు. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ విడివిడిగా జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులతో సమావేశమయ్యారు. ఇండో-పసిఫిక్ రీజియన్ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.
After programmes in Delaware, landed in New York. Eager to be among the diaspora at the community programme in the city and to take part in other programmes. pic.twitter.com/6Q48tyW4hV
— Narendra Modi (@narendramodi) September 22, 2024
-
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
జాక్‌పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్‌గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా












Click it and Unblock the Notifications