వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతనికి అంత సీన్‌ లేదు: ఓవర్ రేటెడ్ ఆల్‌రౌండర్: ఫ్యాన్స్ బౌన్సర్లు: పనిలో పనిగా రోహిత్‌పైనా

|
Google Oneindia TeluguNews

దుబాయ్: ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా ప్రస్తుతం ఫ్యాన్స్ ఆగ్రహజ్వాలలకు బలి అవుతున్నాడు. మొన్నటికి మొన్నే ఓ మ్యాచ్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరగడంతోనే అతనిపై ఆశలను వదిలేసుకున్న ముంబై ఇండియన్స్ అభిమానులు.. సూపర్ ఓవర్‌లో దారుణంగా ఆడటం పట్లా మండిపడుతున్నారు. సూపర్ ఓవర్‌లో భారీ స్కోరు సాధించేంతటి సీన్ హార్ధిక్ పాండ్యాకు లేదని, అతను ఓ ఓవర్ రేటెడ్ ఆల్‌రౌండర్ అంటూ చెడుగుడు ఆడుతున్నారు. ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ అయిన ఇషాన్ కిషన్‌ను కాదని సూపర్ ఓవర్‌లో హార్ధిక్‌ను ఆడించడం పట్ల రోహిత్ శర్మనూ వదలట్లేదు.

రైలు ప్రయాణికుల వీపు విమానం మోతే: ఒక్కో టికెట్‌పై రూ.35 వరకు: కేబినెట్ ఆమోదమే బ్యాలెన్స్రైలు ప్రయాణికుల వీపు విమానం మోతే: ఒక్కో టికెట్‌పై రూ.35 వరకు: కేబినెట్ ఆమోదమే బ్యాలెన్స్

సూపర్ ఓవర్‌లో దారుణంగా..

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో భాగంగా సోమవారం రాత్రి దుబాయ్‌ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. టైగా ముగిసిన ఈ మ్యాచ్‌లో విజేతను నిర్ధారించడానికి సూపర్ ఓవర్ వేయాల్సి వచ్చింది. సూపర్ ఓవర్‌లో ముంబై ఇండియన్స్ తరఫున కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కు దిగారు. ఈ ఇద్దరు హిట్లర్లు కలిసి ఏడు పరుగులు మాత్రమే చేయగలిగారు.

సూపర్ ఓవర్‌లో ఒక్క పరుగేనా..

సూపర్ ఓవర్‌లో వచ్చిన మొత్తం ఏడు పరుగుల్లో హార్దిక్ పాండ్యా వాటా ఒక్క రన్ మాత్రమే. పొలార్డ్ ఓ ఫోర్, ఒక సింగిల్ చేసి అవుట్ అయ్యాడు. ఇంకో రన్ లెగ్‌బై రూపంలో వచ్చింది. మ్యాచ్ ఫలితాన్ని శాసించగల సూపర్ ఓవర్‌లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. ఎనిమిది పరుగుల టార్గెట్‌‌ను మాత్రమే తన ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది. లక్ష్యాన్ని ఛేదించడానికి క్రీజులో దిగిన రాయల్ ఛాలెంజర్స్.. ఆ లాంఛనాన్ని పూర్తి చేసింది. విరాట్ కోహ్లీతో కలిసి సూపర్ ఓవర్ ఆడిన ఏబీ డివిలియర్స్.. రెండు ఫోర్లతో తన జట్టుకు విజయాన్ని అందించాడు.

హార్థిక్‌ను పంపడం పట్ల

సూపర్ ఓవర్‌లో హార్ధిక్ పాండ్యా దారుణంగా విఫలం కావడం పట్ల ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. పాండ్యా గుడ్ సెలెక్షన్ కాదని అంటున్నారు. అతను ఓ ఓవర్ రేటెడ్ ఆల్‌రౌండర్‌గా, అంచనాలను ఏ మాత్రం అందుకోలేని బ్యాట్స్‌మెన్‌గా కామెంట్స్ చేస్తున్నారు. కోల్‌కత నైట్ రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరగడంతోనే అతని స్థాయి ఏమిటో తేలిపోయిందని చురకలు అంటిస్తున్నారు ఫ్యాన్స్. పనిలో పనిగా.. పాండ్యాను సూపర్ ఓవర్ కోసం దింపిన రోహిత్ శర్మనూ వదలట్లేదు. 58 బంతుల్లో 9 సిక్సర్లు, రెండు ఫోర్లతో 99 పరుగులు చేసి, ఊపు మీదున్న ఇషాన్ కిషన్‌ను పంపించకపోవడం సరైన నిర్ణయం కాదని చెబుతున్నారు.

English summary
Mumbai Indians all rounder Hardik Pandya Becomes Butt Of Jokes After failure in Super Over against Royal Challenges Bengaluru match in IPL 2020. Hardik pandya is not in form he ruined the super over, says Mumbai Indian tema fans,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X