వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్‌లో సత్తా చాటుతున్న ఐపీఎల్ 13వ సీజన్: ఈపీఎల్‌ను మించి వ్యూయర్షిప్

|
Google Oneindia TeluguNews

లండన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్.. సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. పాత రికార్డులను బద్దలు కొడుతోంది. వ్యూవర్‌షిప్‌లో చరిత్ర సృష్టిస్తోంది. ఇదేదో భారత్‌లో అనుకుంటే పొరపాటే. ఐపీఎల్ మ్యాచ్‌లు ఎప్పుడు..ఎక్కడ నిర్వహించినా భారత్‌లో వ్యూవర్‌షిప్ భారీగా ఉంటుంది. టీఆర్పీ రేటింగ్స్ హైపిచ్‌కు చేరుకుంటుంటాయి. ఈ సారి భారత్‌లోనే కాదు.. బ్రిటన్‌లో కూడా అత్యధిక వ్యూస్‌ను సాధించింది ఐపీఎల్. ఇది ఏ రేంజ్‌లో ఉందంటే.. బ్రిటీషర్లు అత్యధికంగా ప్రేమించే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)‌ ఫుట్‌బాల్ మ్యాచ్‌లను కూడా మించిపోయింది.

బ్రాడ్‌క్యాస్టర్స్ ఆడియన్స్ రీసెర్చ్్ బోర్డు (బీఏఆర్‌బీ) నివేదిక ప్రకారం.. ఐపీఎల్-2020 సీజన్ మ్యాచ్‌లను వారం రోజుల వ్యవధిలో 7,97,000 మంది తిలకించారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు జరిగిన మ్యాచ్‌లకు సంబంధించిన వ్యూవర్‌షిప్ ఇది. ఆ ఆరు రోజుల వ్యవధిలో ఇన్ని లక్షల మంది వీక్షకులు ఐపీఎల్ మ్యాచ్‌లను తిలకించడం ఇదే తొలిసారి. ఇదివరకు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లకు కూడా ఈ రేంజ్‌లో వ్యూవర్‌షిప్ లభించలేదని బీఏఆర్‌బీ వెల్లడించింది. ఐపీఎల్-2019తో పోల్చుకున్నా కూడా.. ఈ ఫిగరే అత్యధికం.

IPL 2020: IPL 13th season garners higest viewership in UK surpassing EPL

అలాగే- రెండు వారాల కిందట నమోదైన వ్యూవర్‌షిప్‌ను పరిగణనలోకి తీసుకున్నా కూడా 12-18 తేదీల మధ్య బ్రిటన్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను చూసిన వారి సంఖ్య 2,50,000లకు పెరిగిందని బీఏఆర్‌బీ పేర్కొంది. బ్రిటన్‌లో స్కై స్పోర్ట్స్ ఛానల్ ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. క్రికెట్ బెట్ ఇండియా అంచనాల ప్రకారం.. బ్రిటన్‌లో ఐపీఎల్-2019 సీజన్ మ్యాచ్‌లను 5,86,000 మంది తిలకించగా.. ఈ సీజన్ నాటికి ఆ సంఖ్య మరింత పెరిగింది. 7,97,000కు చేరుకుంది. కాగా- ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఆరంభం అయ్యే సమయానికి వ్యూవర్‌షిప్ మరింత పెరగొచ్చనే అంచనాల ఉన్నాయి.

ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా న్యూ క్యాజిల్ యునైటెడ్, మాంచెస్టర్ యునైటెడ్ ఎఫ్‌సీ మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను 40 వేల మంది వీక్షించారు. లివర్‌పూల్-షెఫ్ఫీల్డ్ యునైటెడ్ మ్యాచ్‌ను 1,10,000 మంది, ఆర్సెనాల్-లీసెస్టర్ సిటీ మ్యాచ్‌ను 1,40,000 మంది వీక్షించినట్లు బీఏఆర్‌బీ పేర్కొంది. ఇప్పటిదాకా ఇదే అత్యధిక వ్యూవర్‌షిప్. ఐపీఎల్ మ్యాచ్‌లు వాటిని దాటేశాయి. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే 7,97,000 లక్షల వ్యూవర్‌షిప్‌ను అందుకున్నాయి. మున్ముందు మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి.

English summary
As per reports in the Broadcasters Audience Research Board (BARB), the IPL’s fandom in the UK is higher than ever before. The viewership of the games has surpassed even matches in the ever-so-popular English Premier League (EPL).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X