వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్‌ కింగ్స్‌పై దొడ్డిదారిన గెలిచారా?: వార్నింగ్ లిస్ట్‌లో సునీల్ నరైన్: ఎన్నో డౌట్స్: సస్పెన్షన్

|
Google Oneindia TeluguNews

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020లో పంజాబ్ కింగ్స్ కథ దాదాపు క్లోజ్ అయినట్టే. టోర్నమెంట్‌లో ముందుకెళ్లే అవకాశాలు ఏ మాత్రం కనిపించట్లేదా జట్టుకు. ప్లేఆఫ్‌కు చేరడానికి ఒకట్రెండు అవకాశాలు ఉన్నప్పటికీ.. దాన్ని పంజాబ్ జట్టు అందిపుచ్చుకుంటుందా? అనేది అనుమానమే. ప్రస్తుతం దయనీయమైన ఫామ్‌లో ఉందా టీమ్. ప్రతి మ్యాచ్‌ను కూడా గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. టోర్నీ నుంచి నిష్క్రమించే స్థితికి చేరుకుంది.

Recommended Video

IPL 2020 : KKR spinner Sunil Narine Suspect Bowling Action Once Again | KXIP vs KKR || Oneindia
అబుధాబిలో రెండు పరుగుల తేడాతో..

అబుధాబిలో రెండు పరుగుల తేడాతో..

ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలో ఆదివారం కోల్‌కత నైట్ రైడర్స్‌తో గెలిచి తీరాల్సిన మ్యాచ్‌ను కూడా ఓడిపోయింది పంజాబ్ టీమ్. ఇప్పటిదాకా ఆడిన ఏడు మ్యాచుల్లో ఆరింట్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో అట్టడుకు స్థానం నుంచి కదల్లేక పోతోంది. పంజాబ్ జట్టుకు వరుసగా ఇది అయిదో పరాజయం. కోల్‌కత నైట్ రైడర్స్ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. 20 ఓవర్లలో 162 పరుగులు చేయగలిగింది. చివరి బంతికి సిక్స్ కొడితే మ్యాచ్ టై అయ్యే స్థితిలో పంజాబ్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఫోర్‌తో ముగించాడు.

సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై..

సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై..

ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్ కీలకమైన రెండు వికెట్లను పడగొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేశాడు. ప్రత్యేకించి- 18, 20వ ఓవర్‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ల దూకుడుకు కళ్లెం వేయగలిగాడు. తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసిన సునీల్.. 28 పరుగులు ఇచ్చాడు. నికొలస్ పూరన్, మన్‌దీప్ సింగ్‌లను పెవిలియన్ పంపించగలిగాడు. అదే సమయంలో- అతని బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆన్ ఫీల్డ్ అంపైర్లు ఉల్లాస్ గాంధీ, క్రిస్ గెఫెనీ.. ఈ మేరకు అతని బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు చేశారు.

నరైన్.. రెండోసారి..

నరైన్.. రెండోసారి..

సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తం కావడం కొత్తేమీ కాదు. ఇదివరకు 2015 నవంబర్‌లో వెస్టిండీస్ జట్టు శ్రీలంక పర్యటన సందర్భంగా అతని బౌలింగ్‌పై తొలిసారిగా అనుమానాలు మొదలయ్యాయి. పల్లెకెలెలో జరిగిన వన్డేలో సందేహాస్పదంగా అతను బంతులను సంధించినట్లు ఫిర్యాదులొచ్చాయి. అంతకుముందు-2014లో టీ20 ఛాంపియన్స్ లీగ్‌లోనూ అతను ఇవే ఆరోపణలను ఎదుర్కొన్నాడు. సస్పెన్షన్‌కు కూడా గురయ్యాడు. ఆ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. ఇప్పుడు మరోసారి అవే అనుమానాలు అతణ్ని చుట్టుముట్టాయి.

వార్నింగ్ లిస్ట్‌లో..

వార్నింగ్ లిస్ట్‌లో..

ఫీల్డ్ అంపైర్లు ఇచ్చిన ఫిర్యాదుతో సునీల్ నరైన్ పేరును వార్నింగ్ లిస్ట్‌లో చేర్చినట్లు తెలుస్తోంది. మరోసారి అదే పరిస్థితి ఏర్పడటమంటూ జరిగితే.. సస్పెన్షన్ వేటును ఎదుర్కొనడం ఖాయంగా కనిపిస్తోంది. మ్యాచ్ ఫీజులో భారీగా కోత విధింవచ్చనీ చెబుతున్నారు. ఈ టోర్నమెంట్‌లో ఆడటానికి సునీల్ నరైన్‌ను అనుమతి ఇచ్చారు. కోల్‌కత నైట్ రైడర్స్ ఆడే మ్యాచుల్లో తుది జట్టులో అతణ్ని తీసుకోవడానికి ఐపీఎల్ మేనేజ్‌మెంట్ అనుమతి ఇచ్చింది. ఇదే అతనికి చివరి వార్నింగ్. ఇకముందు సందేహాస్పదంగా బంతులను సంధించితే మాత్రం వేటు తప్పదని హెచ్చరించింది.

English summary
Sunil Narine, the Kolkata Knight Riders player, has been reported for bowling with a Suspected Illegal Bowling Action during his side’s Dream11 Indian Premier League (IPL) 2020 match against Kings XI Punjab at Abu Dhabi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X