IPL 2021:ఢిల్లీ పేసర్ అవేష్ ఖాన్ జెర్సీపై రోహిత్ శర్మ ఆటోగ్రాఫ్..ఎందుకో తెలుసా..?
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో పేసర్ ఆవేశ్ ఖాన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ తరపున నాలుగు మ్యాచ్‌లాడిన ఆవేశ్.. ఎనిమిది వికెట్లు తీసి లీడింగ్ వికెట్‌టేకర్ జాబితాలో ఇపుడు రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆవేశ్ 2 ఓవర్లు వేసి 15 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చహర్ వికెట్లను అతడు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఆవేశ్ ఖాన్‌కు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంటే విపరీతమైన అభిమానం. అందుకే మ్యాచ్ తర్వాత తన జెర్సీపై రోహిత్ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఆవేశ్ అభిమానానికి ఫిదా అయిన రోహిత్.. ముసిముసిగా నవ్వుతూ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ ఫొటోలను ఢిల్లీ క్యాపిటల్స్ తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఐపీఎల్ పుణ్యమాని వరల్డ్‌క్లాస్ ప్లేయర్స్‌తో ఆడే అవకాశం యువ ఆటగాళ్లకు దక్కుతోంది. తమ అభిమాన క్రికెటర్లతోనే కలిసి ఆడుతుండటాన్ని వాళ్లు తమ అదృష్టంగా భావిస్తున్నారు.
Fan boy moment for Avesh Khan, getting his Delhi Capitals jersey signed from Rohit Sharma. pic.twitter.com/uE4EGXsl36
— Johns. (@CricCrazyJohns) April 21, 2021
రోహిత్ శర్మ అంటే తనకు ఎంతో అభిమానం అని మ్యాచ్ తర్వాత ఆవేశ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. రోహిత్‌తో కలిసి ఆడేందుకు అవకాశం రాకపోయినా.. ప్రత్యర్థి జట్టు తరపున అతనికి బౌలింగ్ చేయడం ఆనందం కలిగించిందన్నాడు. ఐపీఎల్ టోర్నీ ద్వారా ఎందరో గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడుతున్నానని, వారి ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటున్నానని ఆవేశ్ పేర్కొన్నాడు. ఢీల్లీ డ్రెసింగ్ రూమ్ ప్రశాంతంగా ఉంటుందని, సీనియర్ ఆటగాళ్లు సలహాలు ఇస్తున్నారన్నాడు. ఐపీఎల్ టోర్నీలో ఆడే అవకాశం ఇచ్చిన ఢిల్లీ ప్రాంచైజీకి ఆవేశ్ ధన్యవాదాలు చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా (4/24) తిప్పేశాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి విజయం సాధించింది. శిఖర్ ధావన్ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివరలో ఢీల్లీ వికెట్లు కోల్పోయి ఉత్కంఠ రేపినా.. చివరికి నో బాల్ ద్వారా గెలిచింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications