వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IPL 2021:ఎట్టకేలకు విజయం నమోదు చేసిన సన్‌రైజర్స్..పంజాబ్ పై వండర్‌ఫుల్ విక్టరీ..!

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బోణీ కొట్టింది. మూడు వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అయిన సన్‌రైజర్స్.. చివరకు‌ గెలుపు రుచి చూసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 121 లక్ష్యాన్ని ఇంకా 8 బంతులు మిగిలి ఉండగా కేవలం ఒక్క వికెట్‌ కోల్పోయి ఛేదించింది. హైదరాబాద్‌ ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (63 నాటౌట్‌: 56 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధ శతకం సాధించగా.. డేవిడ్‌ వార్నర్ ‌(37: 37 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌) రాణించాడు. కేన్ విలియమ్సన్ (16) రాకతో హైదరాబాద్‌ విజయం సాధించింది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌కు ఇది మూడో ఓటమి.

అదిరే ఆరంభం:
స్వల్ప లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, కెప్టెన్ డేవిడ్ వార్నర్ మంచి ఆరంభం అందించారు. బ్యాటింగ్‌కి కష్టమైన పిచ్‌పై సింగిల్స్, డబుల్స్ తీస్తూనే.. చెత్త బంతుల్ని బౌండరీకి పంపారు. ఈ క్రమంలో తొలి వికెట్‌కి 10.1 ఓవర్లలోనే 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో మ్యాచ్‌ హైదరాబాద్ చేతుల్లోకి వచ్చేసింది. అయితే.. ఈ దశలో స్పిన్నర్ ఫాబియన్ అలెన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన వార్నర్.. ఫీల్డర్ మయాంక్ అగర్వాల్ చేతికి చిక్కాడు. దీంతో సన్‌రైజర్స్ 73 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.

IPL 2021:Finally SRH records a victory over PBKS in a low scoring Match

డేవిడ్ వార్నర్ అనంతరం నెం.3లో బ్యాటింగ్‌కి వచ్చిన కేన్ విలియమ్సన్ (16 నాటౌట్: 19 బంతుల్లో)తో కలిసి జానీ బెయిర్‌స్టో జట్టును ఆదుకున్నాడు. వార్నర్ ఔట్ తర్వాత కాస్త దూకుడు తగ్గించిన బెయిర్‌స్టో.. హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత మళ్లీ టాప్ ‌గేర్‌లోకి వెళ్లిపోయాడు. మరోవైపు ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడుతున్న కేన్.. లక్ష్యం చిన్నదే కావడంతో నెమ్మదిగా ఆడాడు. బెయిర్‌స్టో ఆఖరి వరకూ బాధ్యతాయుతంగా ఆడి హైదరాబాద్‌ని గెలిపించాడు. ఈ జోడి దాటికి 18.4 ఓవర్లలోనే 121/1తో హైదరాబాద్ గెలుపొందింది. పంజాబ్ బౌలర్ ఫ్యాబియాన్ అలెన్ ఒక వికెట్ తీశాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్ 120 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్‌ 2021లో నమోదైన అత్యల్ప స్కోర్‌ ఇదే కావడం విశేషం. ఆరంభంలో మయాంక్‌ అగర్వాల్ ‌(22: 25 బంతుల్లో 2ఫోర్లు), చివర్లో షారుక్‌ ఖాన్ ‌(22: 17 బంతుల్లో 2సిక్సర్లు) కాసేపు నిలవడంతో ఆమాత్రం స్కోరైనా సాధించింది. కేఎల్‌ రాహుల్ ‌(4), క్రిస్ ‌గేల్‌ (15), నికోలస్‌ పూరన్ ‌(0), దీపక్‌ హుడా (13), మొయిసెస్ హెన్రిక్స్ ‌(14) విఫలమయ్యారు. ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లు తీసిన రైజర్స్‌ బౌలర్లు కింగ్స్‌ను కోలుకోనీయలేదు.

హైదరాబాద్‌ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ మూడు వికెట్లు తీయగా.. అభిషేక్‌ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. రషీద్‌ ఖాన్‌ నాలుగు ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి ఓ వికెట్‌ తీశాడు. మధ్య ఓవర్లలో కింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ను రషీద్ వణికించాడు. పరుగులు రాకుండా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. యువ క్రికెటర్‌ అభిషేక్‌ కూడా కళ్లు చెదిరే బంతులతో ప్రత్యర్థిని బోల్తా కొట్టించాడు. మొత్తానికి హైదరాబాద్‌ ఐపీఎల్ 2021ల బోణీ కొట్టింది. అయితే స్టార్ పేస‌ర్‌ భువనేశ్వర్ కుమార్‌కు గాయం అయినట్టు తెలుస్తోంది. భువీ తొడ కండరాలు పట్టేసినట్టు సమాచారం.

English summary
IPL 2021, PBKS vs SRH: Jonny Bairstow, David Warner and Khaleel Ahmed fire SRH registered 1st win of IPL 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X