ముంబై ఇండియన్స్ దొంగదెబ్బ: ఐపీఎల్ వేలంలో అంబానీ మార్క్ మైండ్ గేమ్: ప్రత్యర్థి పర్స్‌కు చిల్లు
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ 15వ ఎడిషన్ మెగా వేలంపాట బెంగళూరు వేదికగా రసవత్తరంగా సాగుతోంది. శిఖర్ ధావన్‌తో ఆరంభమైందీ ఈవెంట్. ఈ వేలంపాటలో డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ బోణీ కొట్టాడు. పంజాబ్ కింగ్స్ అతణ్ని కొనుగోలు చేసింది. దీనికోసం 8 కోట్ల 25 లక్షల రూపాయలను ఖర్చు చేసింది. ఆ తరువాత రవిచంద్రన్ అశ్విన్, పాట్ కమ్మిన్స్, కగిసో రబడ, ట్రెంట్ బౌల్ట్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ షమీ, ఫాప్ డుఫ్లెసిస్, క్వింటన్ డికాక్, డేవిడ్ వార్నర్ అమ్ముడుపోయారు.
స్పెషల్ అట్రాక్షన్..కావ్య మారన్: కేన్ మామకు తోడెవరు: సన్‌రైజర్స్‌లో కొత్త ముఖాలు

ప్రత్యర్థి ఫ్రాంఛైజీని రెచ్చగొట్టే యత్నం..
సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లల్లో ఎత్తుకు పైఎత్తులు, వ్యూహాలు-ప్రతివ్యూహాలు, మైండ్‌గేమ్స్‌ను అనుసరిస్తుంటారు ఆయా జట్ల కేప్టెన్లు. ప్రత్యర్థి జట్టుపై పైచేయిని సాధించడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కెచ్ వేస్తుంటారు. అవే తరహా సన్నివేశాలు ఐపీఎల్ వేలంపాటల్లోనూ సాక్షాత్కరించాయి. స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసే విషయంలో ఈ మైండ్ గేమ్ స్పష్టంగా కనిపించింది. ప్రత్యర్థి పర్స్‌ను ఖాళీ చేసేలా రెచ్చగొట్టడం అనేది ఈ వేలంపాటలో లీడ్ పాయింట్.

ముంబై ఇండియన్స్ సక్సెస్..
ఈ విషయంలో ముంబై ఇండియన్స్ భలేగా సక్సెస్ అయింది. ప్రత్యర్థి ఫ్రాంఛైజీ అంచనాలకు ఏ మాత్రం అందని విధంగా ప్రవర్తించింది ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్. ఈ విషయంలో ఇప్పటికే ఇద్దరు స్టార్ ప్లేయర్లను ఎక్కువ ధరను పెట్టి కొనుగోలు చేసేలా రెచ్చగొట్టింది. ఫలితంగా- ఆ రెండు ఫ్రాంఛైజీల పర్స్‌కు చిల్లు పడింది. అనుకున్న దాని కంటే అధిక మొత్తాన్ని వారిపై ఖర్చు చేయాల్సి వచ్చింది ముంబై ఇండియన్స్ వల్ల.

తొలుత ట్రెంట్ బౌల్ట్ విషయంలో..
తొలుత ట్రెంట్ బౌల్ట్ విషయంలో తన స్కెచ్‌ను ఇంప్లిమెంట్ చేసింది. న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్. కిందటి ఐపీఎల్ సీజన్ వరకూ అతను ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. అతన్ని రిటైన్ చేసుకోలేదా ఫ్రాంఛైజీ. వేలానికి విడుదల చేసింది. వేలంపాట సందర్భంగా ట్రెంట్ బౌల్ట్‌ను కొనుగోలు చేయడానికి రెండు ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. ఆరు కోట్ల రూపాయలకు బౌల్ట్‌ను దాదాపుగా రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిందనుకునే సమయంలో..అనూహ్యంగా ముంబై ఇండియన్స్ మైండ్ గేమ్ ఆడింది.

చివరి నిమిషంలో ఎంట్రీ..
చివరి నిమిషంలో ముంబై ఇండియన్స్ ఆక్షన్ రేసులోకి వచ్చింది. ట్రెంట్ బౌల్ట్ కోసం రాజస్థాన్ రాయల్స్‌తో పోటీ పడింది. ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ తీవ్రమైంది. ఈ రెండు ఫ్రాంఛైజీలు తమ రేటును పెంచుకుంటూ పోయాయి. అలా పెంచుకుంటూ పోయేలా రాజస్థాన్ రాయల్స్‌ను రెచ్చగొట్టింది ముంబై ఇండియన్స్. ఈ రేటు చివరికి- ఎనిమిది కోట్ల రూపాయల వద్దకు చేరుకున్న తరువాత వేలంపాట నుంచి తప్పుకొంది ముంబై. బౌల్ట్‌ను రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.

రెండు కోట్లు అధికంగా..
నిజానికి - ఆరు కోట్ల రూపాయల వద్దే బౌల్ట్‌ను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేయాల్సి ఉండగా.. చివరి రౌండ్‌లో అనూహ్యంగా ముంబై ఇండియన్స్ పోటీ పడటం వల్ల ఆ రేటు ఎనిమిది కోట్లకు చేరింది. అంటే- రెండు కోట్ల రూపాయలను అధికంగా సమర్పించుకోవాల్సి వచ్చింది రాజస్థాన్ రాయల్స్‌కు. ఆరు కోట్లను చెల్లించాల్సిన చోట- ఎనిమిది కోట్లతో కాంట్రాక్ట్‌ను కుదుర్చుకోవాల్సి వచ్చింది.

డేవిడ్ వార్నర్ విషయంలోనూ..
ఇదే వ్యూహాన్ని ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్- డేవిడ్ వార్నర్ విషయంలోనూ విజయవంతంగా అమలు చేసింది. డేవిడ్ వార్నర్ కోసం తొలుత ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైజ్ నుంచి రేటును పెంచుకుంటూ పోయాయి ఈ రెండు జట్లు కూడా. డేవిడ్ వార్నర్ ప్రైస్ 6 కోట్ల 25 లక్షల రూపాయల వద్దకు చేరుకున్న తరువాత చెన్నై సూపర్ కింగ్స్ వెనక్కి తగ్గింది. ఆక్షన్ నుంచి వైదొలగింది.

మళ్లీ ముంబై ఇండియన్సే..
దీనితో వార్నర్ దాదాపు ఢిల్లీ కేపిటల్స్‌కు సొంతం అయ్యాడనుకుంటున్న దశలో మళ్లీ ముంబై ఇండియన్స్ రంగ ప్రవేశం చేసింది. 6.25 కోట్ల రూపాయల వార్నర్ రేటును పెంచింది. దీనితో అతణ్ని దక్కించుకోవాలనుకున్న ఢిల్లీ కేపిటల్స్- ఈ సారి ముంబై ఫ్రాంఛైజీతో పోటీ పడాల్సి వచ్చింది. ఈ రెండు జట్లూ వార్నర్ రేటును పెంచుకుంటూ పోయాయి. అతని ధర 8 కోట్ల 25 లక్షల రూపాయలకు చేరుకున్న తరువాత ముంబై ఇండియన్స్ రేసు నుంచి డ్రాప్ అయింది.

ఇక్కడా రెండు కోట్లు అధికంగా..
రాజస్థాన్ రాయల్స్ లాగే ఢిల్లీ కేపిటల్స్ కూడా- రెండు కోట్ల రూపాయలను అధికంగా చెల్లించి డేవిడ్ వార్నర్‌ను దక్కించుకోవాల్సి వచ్చింది- చివరి నిమిషంలో ముంబై ఇండియన్స్ రేసులోకి రావడం వల్ల. ఇలా చేయడం వల్ల ఆయా ఫ్రాంఛైజీల పర్స్ త్వరగా ఖాళీ అవుతుంది. వేలం పాట చివరిదశకు వచ్చే సమయానికి- మరికొంతమంది స్టార్ ప్లేయర్లను తీసుకునే విషయంలో అవి పోటీ పడలేవు. ఆ సమయంలో ముంబై ఇండియన్స్ తాను నిర్దేశించుకున్న ప్రైస్ లేదా దానికంటే కొంత మొత్తాన్ని అధికంగా చెల్లించడానికి వీలు ఉంటుందనేది టాక్.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications