నువ్వు దేవుడివి సామీ: ధోనీ కాళ్లు మొక్కిన సింగర్.. సీన్ హైలైట్

అహ్మదాబాద్: ఇండియన్ ప్రీిమియర్ లీగ్ 2023 సీజన్ 16వ ఎడిషన్‌లో గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది. ఈ సీజన్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. అహ్మదాబాద్ మొతెరాలోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ చెలరేగింది. ఆ జట్టుకు ఇది హోమ్ పిచ్ కావడం కలిసొచ్చింది. 178 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.

టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెలరేగాడు. 50 బంతుల్లో 92 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది భారీ సిక్సర్లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. అతనొక్కడే టాప్ స్కోరర్. అతను తప్ప మరే బ్యాటర్ కూడా రాణించలేదు. డెవాన్ కాన్వే-1, మొయిన్ అలీ- 23, బెన్ స్టోక్స్- 7, అంబటి రాయుడు- 12, శివం దుబే- 19, రవీంద్ర జడేజా- 1 పరుగులు చేశారు. చివరిలో కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 7 బంతుల్లో ఒక భారీ సిక్సర్, ఒక ఫోర్ తో 14 పరుగులు చేశాడు. దీనితో జట్టు స్కోర్ 178 పరుగులకు చేరింది.

IPL 2023, CSK vs GT: Arijit Singh touched the feet of MS Dhoni during the opening ceremony

అనంతరం బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడింది. 19.2 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. జట్టు విజయంలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కీలకపాత్ర పోషించాడు. 36 బంతుల్లో మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 63 పరుగులు చేవాడు. సాహా-25, సాయి సుదర్శన్- 22, విజయ్ శంకర్- 27 పరుగులు చేశారు. చివర్లో రషీద్ ఖాన్ మూడు బంతుల్లో 10 పరుగులు చేసి, జట్టును గెలిపించాడు.

ఐపీఎల్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించాయి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. ఈ సీజన్ ఓపెనింగ్ కార్యక్రమంలో టాప్ హీరోయిన్స్ రష్మిక మందన్న, తమన్నా, ప్రముఖ గాయకుడు ఆర్జిత్ సింగ్.. మెరుపులు మెరిపించారు. నాటు నాటు పాటకు వీరనాటుగా స్టెప్స్ వేసింది రష్మిక. ఈ సెలబ్రేషన్స్ ను మందిరా బేడీ హోస్ట్ చేశారు. సింగర్ అర్జిత్ సింగ్ తన పాటలతో అదరగొట్టాడు. ఆల్‌టైమ్ హిట్ సాంగ్స్‌తో ప్రేక్షకులను మైమరిపించాడు. ఓపెన్ టాప్ కారులో పాటలు పాడుతూ గ్రౌండ్ మొత్తం తిరిగాడు.

IPL 2023, CSK vs GT: Arijit Singh touched the feet of MS Dhoni during the opening ceremony

ప్రారంభ వేడుకల్లో భాగంగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల కేప్టెన్లు హార్దిక్ పాండ్యా, మహేంద్ర సింగ్ ధోనీ డయాస్ పైకి చేరుకున్నారు. ఆ సమయంలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. సింగర్ ఆర్జిత్ సింగ్- ధోని పాదాలకు నమస్కరించాడు. అతని కాళ్లపై పడి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. ఈ సీన్.. ఓపెనింగ్ సెరిమనీ మొత్తానకి హైలైట్ గా నిలిచింది. ఈ ఫొటో క్షణాల్లో వైరల్ గా మారింది. ధోని దేవుడంటూ ఆకాశానికెత్తేస్తోన్నారు ఫ్యాన్స్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+