ధోనీ పొరపాటు చేశాడా? భయపెడుతున్న ఐపీఎల్ ట్రెండ్- సీఎస్‌కే ఓటమి ముందే ఖరారైందా?
అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్స్ ఎట్టకేలకు ఆరంభమైంది. గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆదివారం నాడే ఈ మ్యాచ్ షెడ్యూల్ అయినప్పటికీ- వరుణుడు అడ్డుపడ్డాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా హోరాహోరీగా సాగుతుందనుకున్న ఈ మ్యాచ్ గంగపాలయింది. మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దీనితో ఇవ్వాళ్టికి మ్యాచ్ రీషెడ్యూల్ అయింది.
సరిగ్గా 7 గంటలకు టాస్ పడింది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్ ఆరంభించింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, సెంచరీల హీరో శుభ్‌మన్ గిల్ ఆడుతున్నారు. వారిద్దరూ ధాటిగా ఆడుతున్నారు. చెన్నై బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. అయిదు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 49 పరుగులను రాబట్టుకున్నారు. ఇందులో ఆరు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.

టాస్ గెలిచిన ధోనీ తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం పొరపాటు చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ముందే ఓటమి ఖరారైందని వాదిస్తోన్న గుజరాత్ టైటాన్స్ అభిమానులూ లేకపోలేదు. దీనికి ఓ కారణం ఉంది. 2008లో ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచీ బేసి సంఖ్యలో ఉన్న సంవత్సరంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్స్‌లల్లో ఛేజింగ్ టీమ్ ఓడిపోతూ వస్తోంది.
2021 వరకూ కూడా క్రమం తప్పకపోవడం, ఇది కూడా బేసి సంఖ్యతో కూడిన సంవత్సరమే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2009 సీజన్ ఫైనల్స్‌లో ఛేజింగ్ టీమ్ ఓడిపోయింది. అప్పటి నుంచీ వరుసగా బేసి సంఖ్యతో కూడిన సంవత్సరంలో ఒక్కసారి కూడా ఛేజింగ్ టీమ్ గెలవలేదు. 2011, 2013, 2015, 2017, 2019, 2021 సీజన్ ఫైనల్స్‌లో ఛేజింగ్ టీమ్ ఓడిపోయింది. 2003 మళ్లీ బేసి సంఖ్యతో కూడిన సంవత్సరమే.
ఈ సీజన్ ఫైనల్స్‌లో టాస్ గెలిచిన ధోనీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ ట్రెడీషన్ కాస్తా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను కలవరపెడుతోంది. దీనికి తగ్గట్టుగా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతోండటం, రన్ రేట్ 10కి పైగా నమోదవుతోండటం వారిని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇదే దూకుడును గనక టైటాన్స్ బ్యాటర్లు కొనసాగించగలిగితే భారీ స్కోర్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. అలవోకగా 200 పరుగులను దాటేలా ఉంది.












Click it and Unblock the Notifications