Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రెండు సిక్సర్లు- రెండు వికెట్లు- రెండు లెగ్‌బైస్: ఫైనల్ ఓవర్ థ్రిల్లర్

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్స్‌లో గుజరాత్ టైటాన్స్ మెరుపులు మెరిపించింది. స్టేడియంలో పరుగుల వరద పారించింది. ఊహించినట్టే భారీ స్కోర్‌ను సాధించింది. ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌ బౌలర్ల తుక్కు రేగ్గొట్టారు బ్యాటర్లు. ప్రత్యేకించి- ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ అదరగొట్టాడు.

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్ ఆరంభించింది. తన నిర్ణయం తప్పు అని తెలుసుకోవడానికి ధోనీకి ఎంతో సమయం పట్టలేదు. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ శుభారంభాన్ని ఇచ్చారు. ప్రారంభ ఓవర్లల్లో వారిద్దరూ ధాటిగా ఆడారు. చెన్నై బౌలర్లను దడదడలాడించారు.

 IPL 2023 Final

ఈ సీజన్‌లో మూడు సెంచరీలను అలవోకగా ఊది అవతల పడేసిన శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో కూడా ప్రతాపం చూపాడు గానీ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేకపోయాడు. 20 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఇందులో ఏడు బుల్లెట్ల వంటి ఫోర్లు ఉన్నాయి. 195 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడీ డాషింగ్ ఓపెనర్. జట్టు స్కోర్ 67 పరుగుల వద్ద ఉన్నప్పుడు అవుట్ అయ్యాడు.

ఆ తరువాత కూడా గుజరాత్ టైటాన్స్ దూకుడుకు ఎక్కడే గానీ బ్రేకులు పడలేదు. మరో ఎండ్‌లో వృద్ధిమాన్ సాహా, ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ విజృంభించారు. ఈ క్రమంలో సాహా హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 39 బంతుల్లో ఒక సిక్సర్, అయిదు ఫోర్లతో 54 పరుగులు చేసి, దీపక్ చాహర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయిన సాయి సుదర్శన్.. తన ప్రతాపం చూపాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల దుమ్ము దులిపాడు. 47 బంతుల్లోనే ఆరు భారీ సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 96 పరుగులు చేశాడు. సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. మతీషా పతిరాన బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అతనికి తోడుగా నిలిచిన కేప్టెన్ హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

మథీషా పతిరాన విసిరిన చివరి ఓవర్ థ్రిల్లర్‌గా మారింది. రెండు సిక్సర్లు, రెండు వికెట్లు, రెండు లెగ్‌బైస్ రికార్డయ్యాయి ఈ ఓవర్‌లో. తొలి రెండు బంతులను సాయి సుదర్శన్ సిక్సర్లుగా మలిచాడు. మూడో బంతిని కూడా షాట్ ఆడటానికి ప్రయత్నించి టైమింగ్ మిస్ అయ్యాడు. పతిరాన విసిరిన షార్ట్ యార్కర్.. నేరుగా సాయి సుదర్శన్ పాదాలకు కాస్త పైన తాకింది.

ఆ వెంటనే ఎల్బీడబ్ల్యూగా అప్పీల్ చేశాడు పతిరాన. దీనిపై రివ్యూ కోరారు. అది అవుట్‌గా తేలడంతో సెంచరీ ముంగిట్లో నిరాశగా వెనుదిరిగాడు. ఆ తరువాతి రెండు బంతులూ లెగ్‌బైస్‌గా మారాయి. చివరి బంతికి రషీద్ ఖాన్ అవుట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీనితో 214 పరుగుల వద్ద గుజరాత్ ఇన్నింగ్‌కు తెరపడింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+