రోహిత్ శర్మ ఎక్కడ? వడా పావ్ తినడానికెళ్లాడా?
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీిమియర్ లీగ్ 2023 (IPL 2023) 16వ సీజన్ ఇంకొన్ని గంటల్లో గ్రాండ్‌గా ఆరంభం కాబోతోంది. శుక్రవారం తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. గత సీజన్ ఛాంపియన్ గా నిలిచిన గుజరాత్ టైటన్స్‌కు ఇది హోం పిచ్.
Rohit sharma kya vada pav khane gaya hai?
— Sindhi Chhokro (@Piyush_seerwani) March 30, 2023
సీజన్ ప్రారంభానికి ముందు- అన్ని జట్లకు చెందిన కేప్టెన్లు ఇవ్వాళ నరేంద్ర మోదీ స్టేడియంలో ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఐపీఎల్ 2023 ట్రోఫీతో పాటు ఫొటో షూట్ కు అటెండ్ అయ్యారు.. ఒక్క ముంబై ఇండియన్స్ కేప్టెన్ రోహిత్ శర్మ తప్ప. సన్‌రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ కూడా గైర్హాజర్ అయ్యాడు. అతను ఇంకా జట్టుతో కలవలేదు. దక్షిణాఫ్రికా తరఫున ఇంటర్నేషనల్స్ మ్యాచ్ లను ఆడుతోన్నందు వల్ మార్క్‌రమ్ కాస్త ఆలస్యంగా జట్టుతో కలవనున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున సీనియర్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.. ఈ ఫొటో షూట్ లో పాల్గొన్నాడు. ఢిల్లీ కేపిటల్స్- డేవిడ్ వార్నర్, రాజస్థాన్ రాయల్స్- సంజు శాంసన్, గుజరాత్ టైటన్స్- హార్దిక్ పాండ్యా, చెన్నై సూపర్ కింగ్స్- మహేంద్రసింగ్ ధోనీ, లక్నో సూపర్ జెయింట్స్- కేఎల్ రాహుల్, పంజాబ్ కింగ్స్- శిఖర్ ధవన్, కోల్‌కత నైట్ రైడర్స్- నితీష్ రాణా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- ఫాఫ్ డుప్లెసిస్.. ఈ కేప్టెన్ల ఫొటో షూట్ లో పాల్గొన్నారు.
Where is the OWNER OF THE TROPHY ? pic.twitter.com/bc2KDmA21o
— David (@CricketFreakD2) March 30, 2023
ముంబై ఇండియన్స్ తరఫున ఎలాంటి ప్రాతినిథ్యం కనిపించలేదు ఇందులో. రోహిత్ శర్మ డుమ్మా కొట్టాడు. పోనీ- సన్‌రైజర్స్ హైదరాబాద్ తరహాలో ముంబై ఇండియన్స్ నుంచి మరో ప్లేయర్ కూడా అటెండ్ కాలేదు. అనారోగ్య కారణాల వల్ల రోహిత్ శర్మ ఈ ఫొటో షూట్ కు గైర్హాజర్ అయ్యాడు. ఫలితంగా- ముంబై ఇండియన్స్ ఎదుర్కొనే కొన్ని మ్యాచ్ లకు కూడా అతను దూరం కానున్నాడనే వార్తలు ఇదివరకే వెలువడ్డాయి. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కు కేప్టెన్సీ బాధ్యతలను అప్పగిస్తారని తెలుస్తోంది.
one captain is missing @CricCrazyJohns
— Sultan Khan (@MainHoonSultan7) March 30, 2023
ఈ ఫొటో షూట్ లో రోహిత్ శర్మ పాల్గొనకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ మీద పెద్ద ఎత్తున డిబేట్స్ కు దారి తీసింది. రోహిత్ శర్మను అభిమానులు ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తోన్నారు. రోహిత్ శర్మ గానీ వడపావ్ తినడానికెళ్లాడా? అంటూ చురకలు అంటిస్తోన్నారు. రోహిత్ మిస్ కావడం తమను తీవ్ర నిరాశకు గురి చేస్తోందంటూ మరికొందరు ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు. నిజంగా అతను అనారోగ్యం బారిన పడి ఉంటే వెంటనే కోలుకోవాలని కోరుకుంటోన్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
9 teams will fight to play the final 2023 with Rohit Sharma's Mumbai Indians 🔥🔥 pic.twitter.com/I0F83aafE5
— VECTOR (@Vector_45R) March 30, 2023












Click it and Unblock the Notifications