అయోధ్య రామునికి విరాళాలు ఎందుకు..? కోరుట్ల ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..
అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతోంది. రామ భక్తులు/ ఇతరులు విరాళాలు అందజేస్తున్నారు. అయితే విరాళాల గురించి నేతలు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అనుకూలంగా.. మరికొందరు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కూడా కామెంట్స్ చేశారు. అయోధ్య రామాలయానికి నిధులు ఎందుకు అంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు అగ్గారాజేశాయి. రామ భక్తులు, హిందూ సంఘాల నేతలు ఒంటికాలిపై లేస్తున్నారు.
Recommended Video


అయోధ్య ఆలయానికి నిధులు ఎందుకు..?
యూపీలో గల అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోంది. తోచిన విధంగా అందరూ సాయం చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాత్రం యూపీలో రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దు అని కోరారు. ఉత్తరప్రదేశ్ రాముడు మనకెందుకు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. మన వద్ద రాముడి ఆలయాలు లేవా అంటూ కొత్త వివాదానికి తెరలేపారు. ఇక్కడ ఉన్న ఆలయాలకు విరాళాలు ఇవ్వాలని కోరారు. కానీ సాగర్ రావు కామెంట్స్‌పై రామ భక్తులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

రాముని పేరుతో భిక్షం..?
రాముని పేరు మీద కొందరు భిక్షం ఎత్తుకుంటున్నారని సాగర్ రావు వ్యాఖ్యలు చేశారు. కొత్త నాటాకనికి తెర లేపుతున్నారని బీజేపీపై విమర్శలు చేశారు. బొట్టు పెట్టుకుంటేనే రాముని భక్తులమా అని అడిగారు. తామంతా శ్రీరాముని భక్తులమేనని వ్యాఖ్యానించారు. భక్తి అనేది మనసులో ఉండాలని సూచించారు. కానీ సాగర్ రావు కామెంట్స్ మాత్రం వైరల్ అయ్యాయి. వ్యాఖ్యలను హిందూసంఘాలు తప్పుపడుతున్నాయి. వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

క్రాంతి అలా.. సాగర్ ఇలా..
టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్.. ఇటీవల అయోధ్య రామాలయం కోసం తీసిన ర్యాలీలో పాల్గొన్నారు. అదీ చర్చకు దారితీసింది. అంతలోనే యూపీలో గల రామలయానికి నిధులు ఎందుకు అని సాగర్ రావు కామెంట్ చేశారు. దీనిపై దుమారం చెలరేగింది. బీజేపీ/ హిందూ సంస్థల నేతల నుంచి వ్యతిరేకత వస్తోంది. మరీ తన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వెనక్కి తగ్గుతారో లేదో చూడాలీ.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications