ట్రెండింగ్ లో దూసుకెళుతున్న స్టాక్స్ ఇవే.. కొన్నారా?
భారత ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల నుంచి కోలుకుంటున్నాయి. మంచి లాభంతో ఈ వారాన్ని ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పెట్టుబడిదారులు కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో కొన్ని ప్రధానమైన రంగాలు లాభాల్లో ఉన్నాయి. బొంబాయి స్టాక్స్ సూచి సెన్సెక్స్ 141 పాయింట్ల లాభంతో 62 వేల 767 మార్క్ వద్ద, నేషనల్ స్టాక్స్ సూచీ నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి.
బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, హెచ్ సీఎల్ టెక్, ఎస్బీఐ లైఫ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. మారుతీ సుజుకీ, లార్సెన్స్ పవర్ గ్రిడ్, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడు షేర్లు మాత్రం అద్భుతంగా రాణిస్తూ టాప్ ట్రెండింగ్ లోకి దూసుకువచ్చాయి. అవేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యూపిటర్ వ్యాగన్స్ (Jupitor Wagons)
ఈ కంపెనీ షేర్లు ప్రారంభంలోనే 2 శాతం పెరిగాయి. స్టోన్ ఇండియాలో మెజారిటీ షేరు కొంటున్నట్లు కోల్ కతాకు చెందిన కోచ్ మాన్యుఫ్యాక్చర్ ప్లాన్ కు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆమోదం తెలిపింది. దీంతో ఇవి రాణిస్తున్నాయి. ప్రస్తుతం దీని స్టాక్ రూ.135.35 వద్ద నడుస్తోంది.
కొచ్చిన్ షిప్‌యార్డ్ (Cochin Shipyard)
రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఈ కంపెనీ కీలక ప్రాజెక్టు దక్కించుకుంది. దీంతో ఈ కంపెనీ షేర్లు పరుగులు పెడుతున్నాయి. ప్రారంభంలోనే 4 శాతం పెరిగింది. ఇండియన్ నేవీ ఈ కంపెనీని ఎల్ 1 కంపెనీగా గుర్తించింది. త్వరలోనే రూ.300 కోట్ల విలువైన ప్రాజెక్టులపై సంతకాలు చేయబోతున్నారు.
జోంజువా ఓవర్సీస్ (Jonjua Overseas)
జోంజువా ఎయిర్ ప్రైవేటు స్టాక్ మార్కెట్ ప్రారంభంలోనే ఏకంగా 10 శాతం పెరిగింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్ పర్మిషన్ కోసం ఈ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. జోంజువా ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉడాన్ 5.1లో రిజిస్టరైంది.












Click it and Unblock the Notifications