కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివేకా మృతి పై అనుమానాలు : విచార‌ణకు సిట్ ఏర్పాటు : రాజ‌కీయ విమ‌ర్శ‌లు షురూ..!

|
Google Oneindia TeluguNews

వైయ‌స్ వివేకానంద‌రెడ్డి మృతి పై అనుమానాలు పెరుగుతున్నాయి. ఆయన మృత‌దేహం మీద గాయాలు..బెడ్ రూం లో ర‌క్తం..బాత్రూంలో ర‌క్త‌పు మ‌డుగులు అనుమానాలు మ‌రింత‌గా పెంచుతున్నాయి. ఇప్ప‌టికే పిఏ ఫిర్యాదు మేర‌కు క్లూస్ టీం..డాగ్ స్క్వాడ్ ఘ‌ట‌నా స్థ‌లిలో ఉన్నాయి. వివేకా మృతి పై సిట్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు క‌డ‌ప ఎస్పీ ప్ర‌క‌టిం చారు. ఇదే స‌మ‌యంలో రాజ‌కీయంగానూ ర‌గ‌డ మొద‌లైంది..

వివేకాది స‌హ‌జ మ‌ర‌ణం కాదా: ర‌క్త‌పు మ‌డుగులో మృత‌దేహం: పోలీసుల‌కు ఫిర్యాదు..! <br>వివేకాది స‌హ‌జ మ‌ర‌ణం కాదా: ర‌క్త‌పు మ‌డుగులో మృత‌దేహం: పోలీసుల‌కు ఫిర్యాదు..!

పెరుగుతున్న అనుమానాలు..

పెరుగుతున్న అనుమానాలు..

తొలుత గుండెపోటు తో వివ‌కానంద‌రెడ్డి మ‌ర‌ణించార‌ని అంద‌రూ భావించారు. అయితే, ఆ త‌రువాత ఆయ‌న మ‌ర‌ణం పై అనుమానాలు మొద‌ల‌య్యాయి. తలకు గాయం ఉండటం, బెడ్‌ పక్కన రక్తపు మడుగు ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వైఎస్‌ వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి తెలిపారు. రాత్రి వివేకానంద రెడ్డి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఉదయం పనిమనిషితో కలిసి వెళ్లేసరికి తీవ్రగాయాలతో బాత్‌రూమ్‌లో పడి ఉన్నారు. చేతిని పట్టుకో ని చూడగా.. నాడీ కొట్టుకోలేదు. వెంటనే ఆయన భార్య సౌభాగ్యమ్మ, అల్లుడికి ఫోన్‌ చేశాను. బెడ్‌రూమ్‌లో ఏసీ ఆన్‌లోనే ఉంది. బెడ్‌ పక్కన చాలా రక్తం పడి ఉంది. కానీ సార్‌ మాత్రం రక్తపుమడుగులో బాత్‌రూంలో పడి ఉన్నారు. వెనుకవైపు డోర్‌ తెరచి ఉంది. ఆ డోర్‌ ఎందుకు తీసారా? అనే అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను..అం టూ పిఏ కృష్ణారెడ్డి ప‌రిస్థితిని పోలీసుల‌కు వివ‌రించారు.

లోతుగా ద‌ర్యాప్తు చేయాలి..

లోతుగా ద‌ర్యాప్తు చేయాలి..

వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానాలున్నాయని వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఈ ఘ‌ట‌న పై లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం నివేదికలో వాస్తవాలు బయటికొస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తన పెదనాన్న మృతిపై అనుమానాలు కలుగుతున్నాయని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరో దాడి చేస్తే చనిపోయినట్లు ఉందని, తలకు ముందువెనుక గాయాలున్నాయని, చేతులకు గాట్లు ఉన్నాయని అవినాష్ రెడ్డి చెప్పారు.

రాజ‌కీయ ర‌గ‌డ‌..

రాజ‌కీయ ర‌గ‌డ‌..

వివేకానంద రెడ్డి మృతి పై రాజ‌కీయంగానూ ర‌గడ మొద‌లైంది. ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాద్ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. వివేకా ను హ‌త్య చేసార‌ని ఆరోపించారు. అయితే, దీని పై టిడిపి నేత‌లు సైతం తీవ్రంగా ప్ర‌తి స్పందించారు. కోడిక‌త్తి కేసులో ఎన్ఐఏ విచార‌ణ కోరిన జ‌గ‌న్‌..ఇప్పుడు వివేకా మృతి పై ఎందుకు విచార‌ణ డిమాండ్ చేయ‌టం లేద‌ని రాజ్య‌స‌భ స భ్యుడు సీయం ర‌మేష్ వ్యాఖ్యానించారు. వివేకా మృతి పైనా తెలంగాణ పోలీసుల విచార‌ణ కోరుతారా అని టిడిపి నేత లు సందేహం వ్య‌క్తం చేసారు. ఒక వైపు పోలీసుల విచార‌ణ సాగుతున్న స‌మ‌యంలో క‌డ‌ప జిల్లా టిడిపి..వైసిపి నేత‌ల మ‌ధ్య వివేకా మ‌ర‌ణం వ్య‌వ‌హారం రాజకీయంగా ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తోంది.

సిట్ ఏర్పాటు..

సిట్ ఏర్పాటు..

ఇక వివేకానందరెడ్డి పీఏ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. డాగ్‌స్వ్కాడ్‌ను రంగం లోకి దింపారు. కాసేపట్లో ఆయన మృతదేహానికి పోస్ట్‌మార్టం జరగనుందని, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏం జరిగిందనేది తేలుతుందని ఎస్పీ తెలిపారు. బాత్రూంలో రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించామని ఎస్పీ చెప్పారు. ఇదే స‌మ‌యం లో రాజీకీయ రంగు పులుముకుంటున్న ఈ స‌మ‌యంలో దీని పై స‌మ‌గ్ర విచార‌ణ చేయాల‌ని ఎస్పీ నిర్ణ‌యించారు. వివేకా మృతి విచార‌ణ కోసం ప్ర‌త్యేక విచార‌ణ టీం (సిట్‌) ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఎస్పీ ప్ర‌క‌టించారు.

English summary
YS Viveka suspected death creating political tension in Kadapa dist. Kadapa Sp appointed SIt on Vivek's death mystery. TDP and YCP leaders started political arguments on Viveka's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X