Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భగవద్గీత నేర్పిస్తానని గిరిజన బాలిక రేప్.. వేషం మార్చిన పూజారిని పట్టుకున్న పోలీసులు

భగవద్గీత నేర్పిస్తానంటూ ఓ గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడిన గిరిజన పూజారి గెటప్ మార్చాడు. ఫోన్ వదిలేసి, గుండు గీయించుకుని ఎవరికీ దొరకకుండా తిరుగుతున్నాడు. తాజాగా సదరు నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు అయ్యగారి గెటప్ చూసి అవాక్కయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకిఆడపిల్లలపై అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతుంది . ఎక్కడ చూసినా చిన్నా , పెద్ద తేడా లేకుండా మానవ మృగాలు చెలరేగిపోతున్నాయి. నిన్నటికి నిన్న వరంగల్ లో మానస అత్యాచార ఘటన, ఆ తరువాత రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ లో వెటర్నరీ డాక్టర్ దిశ దారుణ అత్యాచార, హత్య ఘటన మరిచిపోకముందే మరో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. గిరిజన మైనర్ బాలిక అని కూడా చూడకుండా ఓ కీచక పూజారి అత్యాచారం చేసి పరారయ్యాడు. గత నెల 28న జరిగిన ఈ ఘటనపై కడప జిల్లా సుండుపల్లె పోలీసులు కేసు నమోదు చేసి అప్పటి నుండి నిందితుడి కోసం గాలిస్తున్నారు .

Tribal girl rape.. The police arrested the priest who changed his get-up

ఇక ఈ ఘటనతో కడప జిల్లా వదిలేసి పరారైన పూజారి దేరంగుల రవి అలియాస్‌ సత్యనారాయణ ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు గీయించుకున్నాడు. బయట కనిపించినవారి ఫోన్లు తీసుకుని కుటుంబ సభ్యులకు ఇతరులకు మాట్లాడుతున్నాడు. అతడి ఇంటికి వచ్చే ఫోన్లపై నిఘా పెట్టిన సుండుపల్లె పోలీసులు అతని కాల్స్ ట్రాక్ చేశారు . అతడు తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో ఉన్నట్లు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు.దీంతో అన్నవరం పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు అన్నవరంలోని మెయిన్‌ రోడ్డు నుంచి రైల్వే స్టేషన్‌కు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అతడిని సుండుపల్లె పోలీసులకు అప్పగించారు

భగవద్గీత నేర్పిస్తానని 14 సంవత్సరాల గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు దేరంగుల రవి అలియాస్‌ సత్యనారాయణ .నాలుగు సంవత్సరాలుగా జీకే రాచపల్లెలోని రామాలయంలో పూజారిగా పని చేస్తున్న రవి రామాలయంలో పిల్లలకు భగవద్గీత శ్లోకాలు బోధిస్తున్నారు. అయితే భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్న క్రమంలో ఓ చిన్నారికి పరీక్ష పెడతానంటూ రామాలయానికి రావాలని చెప్పి ఆ బాలికపై అత్యాచారం చేశాడు . ఇక ఈ ఘటనతో రవి పై కేసు నమోద అయ్యింది. ప్రస్తుతం రవి కటకటాలు లెక్కిస్తున్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+