Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సెల్యూట్ పోలీస్ ..చేపల కోసం బావిలోకి దిగి ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడిన సిఐ

కొందరు పోలీసులు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉంటే కొందరు పోలీసులు మాత్రం మానవత్వంతో శెభాష్ పోలీస్ అనిపించుకుంటారు. కొందరు ఎవరికి ఏమైతే మాకేంటి అన్న చందంగా ప్రవర్తిస్తే కొందరు మాత్రం ఎవరికి కష్టం వచ్చినా మేమున్నామని చెప్పి సెల్యూట్ చేసేలా చేస్తారు. అలాంటి సూపర్ పోలీస్ జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి.

పోలీస్ అంటే శాంతి భద్రతలను కాపాడేవాడే కాదు.. ప్రజలు ఆపదలో వుంటే అవసరం అయితే ప్రాణాలకు తెగించి రక్షించే వాడు కూడా అని నిరూపించారు జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి. చేపల వేటకు బావిలో దిగి శ్వాస ఆడక ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను కాపాడారు .కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లె గ్రామానికి చెందిన మల్లయ్య(45),మారేపల్లి రవీందర్(45) చేపల కోసం మంచినీటి బావిలో దిగారు. కొంతసేపటికే శ్వాస అందకపోవడంతో బావిలో చిక్కుకుపోయారు.

Salute Police .. CI protected both lives from the well who were caught up

ఇక ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు 108తో పాటు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.దీంతో వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్న సీఐ సృజన్ రెడ్డి తానే స్వయంగా బావిలోకి దిగి ప్రాణాలు కాపాడారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. మల్లయ్య,రవీందర్‌లను కాపాడిన సీఐ సృజన్ రెడ్డికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి పోలీసులు కూడా ఉన్నారు అంటూ జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డిని సూపర్ పోలీస్ అని కొనియాడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+