Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Photos:అదరహో అనిపించేలా శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ బర్త్‌డే పార్టీ: అతిథులు వీరే..!

ముంబై: అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ తన 21వ పుట్టిన రోజు శుక్రవారం జరుపుకుంది. ఈ సందర్భంగా ఖుషీ కపూర్ గ్రాండ్‌గా పార్టీ అరేంజ్ చేసింది. ఈ పార్టీకి పలువురు సెలబ్రిటీలు, సెలబ్రిటీల పిల్లలు హాజరయ్యారు. ఇక ఎప్పటిలాగే అక్క జాన్వీ కపూర్ ఈ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ పార్టీకి ఖుషి తన సన్నిహితులను కూడా ఇన్వైట్ చేసింది. ఈ పార్టీని రూఫ్ టాప్‌పై అరేంజ్ చేయడంతో మరింత కిక్కు వచ్చింది.

 గ్రాండ్‌గా ఖుషీ కపూర్ బర్త్‌డే వేడుకలు

గ్రాండ్‌గా ఖుషీ కపూర్ బర్త్‌డే వేడుకలు

ఖుషి కపూర్ శ్రీదేవి చిన్న కుమార్తె. ఈమె 2000వ సంవత్సరం నవంబర్ 5న పుట్టింది. చిన్న కుమార్తె కావడంతో మరింత గారాబంగా పెంచారు శ్రీదేవి దంపతులు. ఇక 21 ఏళ్లు పూర్తి చేసుకుని 22వ ఏటాలోకి అడుగుపెట్టింది ఖుషీ. దీంతో తన బర్త్‌డే పార్టీ మామూలుగా జరగలేదు. ఓ రేంజ్‌లో జరిగింది. ఇక సెలబ్రిటీ పిల్లల బర్త్‌డే పార్టీ ఏ రకంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్‌గా జాన్వీ కపూర్ కనిపించింది. పింక్ కలర్ మినీడ్రెస్‌తో మిలమిల మెరిసింది. అంతేకాదు లైట్ క్లీవేజ్‌ షోతో మరింత స్పెషల్‌గా కనిపించింది జూనియర్ శ్రీదేవి.

జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్

జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్

ఇక పార్టీలో ఖుషీ కపూర్ కూడా చాలా అందంగా కనిపించింది. ఈ బర్త్‌డే పార్టీకి రూఫ్‌టాప్ లేదా ఓపెన్ టెర్రాస్ వేదికగా నిలిచింది. ఇక అక్క జాన్వీ కపూర్‌తో కలిసి ఫోటోలు తీసుకుంది ఖుషీ. ఈ ఫోటోను జాన్వీ కపూర్ సోషల్‌మీడియాలో షేర్ చేసింది. షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఫోటోస్ వైరల్‌ అయ్యాయి. ఇక ఫోటోలను చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేశారు. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు అతిలోక సుందరిలు వావ్... అంటూ పోస్టు చేశారు. మరికొందరైతే వెలుగంతా ఒకే చోట ఉందంటూ కామెంట్ చేశారు. ఇక కుర్రకారు అయితే ఏకంగా ప్రపోజ్ చేస్తూ పెళ్లి చేసుకుందామా అంటూ అడిగారు.

అందమైన భామలతో పార్టీ జిగేల్

అందమైన భామలతో పార్టీ జిగేల్

ఇక ఈ పార్టీకి ప్రముఖ ఫిల్మ్‌ మేకర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్‌, ఫ్యాషన్ బ్లాగర్ ముస్కాన్ చనానా కూడా హాజరవడంతో పార్టీలో అందం మరింత రెట్టింపు అయ్యింది.ఈ ఫోటోలను ఖుషీ తన ఇన్స్‌టాలో షేర్ చేసింది. ఇక జాన్వీ కపూర్ కూడా పలు ఫోటోలను షేర్ చేసింది. ఖుషీ కపూర్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ.. హ్యాపీ బర్త్‌డే మై లడ్డూ బేబీ అంటూ రాసుకొచ్చింది. ఖుషీని జాన్వీ లడ్డూ అని పిలుస్తుందట.

పార్టీకి జాన్వీ మాజీ లవర్

పార్టీకి జాన్వీ మాజీ లవర్

ఇక పార్టీలో హీరో సునీల్ శెట్టి కొడుకు అహన్ శెట్టి కూడా హాజరయ్యాడు. ఇక పార్టీలో అక్షత్ రాజన్ కూడా కనిపించాడు. అక్షత్ రాజన్‌తో ఒకప్పుడు జాన్వీ కపూర్ ప్రేమలో ఉండేదంటూ జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత భూమీ పెడ్నేకర్ అహన్‌ శెట్టిలతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు జాన్వీ ఖుషీ కపూర్‌లు. 21ఏళ్లు పూర్తి చేసుకున్న ఖుషీ కపూర్ త్వరలోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

ఇక ఈ పార్టీ ముంబైలోని జూహూ ప్రాంతంలో ఉన్న అతి విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో జరిగింది. ఈ అపార్ట్‌మెంట్‌ను గతేడాది డిసెంబర్ 7వ తేదీన జాన్వీ కపూర్ రూ.36 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. తన అభిరుచికి తగ్గట్టుగా దీన్ని నిర్మించుకున్నారు. దీనికోసం ఒక్క స్టాంప్‌డ్యూటీ ఛార్జీలే రూ.78 లక్షలు చెల్లించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+