కొత్తగూడెం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మున్సిపల్ చైర్ పర్సన్‌ను కిందపడేసి.. చీర జారుతున్న వెకిలీ చేష్టల, కౌన్సిలర్ భర్త ఆగడాలు..

|
Google Oneindia TeluguNews

యాసంగి పంట కొనుగోలు కోసం అధికార పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే చాలా చోట్ల క్షేత్రస్థాయిలో పాల్గొంటున్నారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా నేత అవమానం జరిగింది. కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ సీతాలక్ష్మిని కౌన్సిలర్ భర్త బైక్‌తో ఢీకొట్టి కిందపడేశాడు. కిందపడిపోయిన మహిళను హేళన చేయడంతో ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. చైర్ పర్సన్‌కే ఇలా జరిగితే మరీ మిగతా వారి పరిస్థితి ఏంటీ అనే ప్రశ్న వస్తోంది. దీనికి అధికార పార్టీ సమాధానం చెప్పాల్సి ఉంది.

బైక్ ర్యాలీ చేయగా..

బైక్ ర్యాలీ చేయగా..


ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తగూడెంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నల్లజెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో పాల్గొన్న కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మితో తోటి కౌన్సిలర్ భర్త అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె బైక్‌ని ఢీకొట్టడంతో అదుపుతప్పి చైర్‌పర్సన్‌ కిందపడిపోయారు. ఆమె చాలా అవమానంగా ఫీలయ్యారు. కంటి తడి తెచ్చుకున్నారు.

దండం పెట్టినా..

దండం పెట్టినా..

మహిళా నేత ఏడుస్తూ దండం పెట్టినప్పటికీ ఆకతాయిలు అవహేళన చేశారు. అవమానంతో ఆమె కంటతడి పెట్టుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుకి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్.. చైర్ పర్సన్ ఇంటికెళ్లి ఆమెను పరామర్శించారు. మహిళా నేతను కిందపడేయడమే కాకుండా.. ఆమెను చీర జారిపోతే హేళన చేస్తూ అవమానకరంగా ప్రవర్తించారని వాపోయారు. బాధపడినా వారు కరుణించలేదు.

వెక్కి వెక్కి ఏడ్చిన చైర్ పర్సన్

వెక్కి వెక్కి ఏడ్చిన చైర్ పర్సన్

అవమానంతో మున్సిపల్ చైర్‌ పర్సన్ ఏడ్చారు. కోపం ఉంటే ఇలా తీర్చుకుంటారా? ఇంత అవమానం చేస్తారా? బైకులో చీర ఇరుక్కుపోయింది ఆగమని బతిమిలాడా.. కుచ్చిళ్లు జారిపోతున్నాయని దండ పెట్టినా.. అయినా బైక్ ఇంకా రైజ్ చేసుకుంటూ పోయాడని కన్నీటి పర్యంతం అయ్యారు. చైర్ పర్సన్‌కే ఇంత అవమానం జరిగితే ఇక సాధారణ మహిళ పరిస్థితేంటి? అని ఆమె ప్రశ్నించారు. నిజానికి ఆమె వేసిన ప్రశ్న సరైందే.. దీనికి అధికార పార్టీ అగ్రనేతలు సమాధానం చెప్పాలి.

ప్రజల సంగతి ఏంటీ

ప్రజల సంగతి ఏంటీ

మున్సిపల్ చైర్ పర్సన్ పట్ల కౌన్సిలర్ భర్త బీహేవ్ చేయడం దారుణం.. దీనిని అంతా ఖండిస్తున్నారు. అతనిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే మరికొందరు రెచ్చిపోయే అవకాశం ఉంది. దీనిని టీఆర్ఎస్ హై కమాండ్ దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. చైర్ పర్సన్‌కే ఇలా జరిగితే.. ఇక సాధారణ పౌరుల సంగతి ఏంటీ అని జనం ప్రశ్నిస్తున్నారు.

English summary
kothagudem councillor husband misbehave to municipal chairperson. he dashed her vehicle, she fell down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X