రెండే రెండు నిముషాల్లో మీ కథ తేలుస్తా... కుప్పంలో భారీగా పోలీసుల మొహరింపు
చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మూడోరోజు పర్యటన కొనసాగుతోంది. కృష్ణానందపల్లి, గుండ్లనాయనపల్లి, కొత్తూరులో బాబు పర్యటన సాగుతోంది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. రెండురోజులుగా పట్టణంలో చోటుచేసుకున్న సంఘటనల దృష్ట్యా భారీగా బందోబస్తు పెంచారు. మూడోరోజు పర్యటనలో చంద్రబాబు తన ప్రత్యర్థి, ఎమ్మెల్సీ భరత్ ఇంటిమీదగా ప్రయాణించాల్సి ఉంది.
దీంతో ఎటువంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. ఆయన భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎన్ ఎస్‌జీ వింగ్ అదనంగా కేంద్రం కమాండోలను చేర్చింది. డీఐజీ స్థాయి అధికారి ఆయన భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తోన్న చంద్రబాబుకు వైసీపీ నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. పార్టీ జెండాలు ఏర్పాటు చేసే విషయంలో ప్రారంభమైన వివాదం చిలికి చలికి గాలివానలా మారింది. ఇరుపార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. అన్న క్యాంటీన్ ధ్వంసం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయకపోవడంపై బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు తమకు సంబంధం లేనట్లుగా కొంచెం సేపు పక్కన ఉంటే వైసీపీ గూండాల కథ రెండు నిముషాల్లో తేలుస్తానన్నారు. పుంగనూరు రౌడీ పెద్దిరెడ్డి, ఆయన తమ్ముడు, డీజీపీ, సలహాదారులు.. అందరూ కుప్పం రావాలని సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications