వైసీపీలో చేరిన కీలక నేత-కండువా కప్పిన జగన్: ఆ పార్టీకి బిగ్ షాక్
అమరావతి: ఏపీ.. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది. అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరో తొమ్మిది నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఏప్రిల్/మే నాటికి పోలింగ్ ప్రక్రియ ముగిసిపోవచ్చు. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది.
ఈ పరిస్థితుల మధ్య వైఎస్ఆర్సీపీలో వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ- వలసలు మరింత పెరిగే అవకాశం ఉంది వైసీపీలోకి. ఇటీవలే నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆనం జయకుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు వైఎస్ జగన్. కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

తాజాగా- కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్.. తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కండువాను కప్పి జగన్ ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు అహ్మద్ అలీ ఖాన్. 2014లో కర్నూలు అసెంబ్లీ, 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. గత ఏడాది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆయన ఆ పార్టీ కండువాను కప్పుకొన్నారు.

అహ్మద్ అలీ ఖాన్‌తో పాటు కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు పోరెడ్డి వేణుగోపాలరెడ్డి, తకియాసాహెబ్, వినయ్ కుమార్.. వైసీపీలో చేరారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి.. ఆ సమయంలో వారి వెంట ఉన్నారు.












Click it and Unblock the Notifications