రీ పోస్టుమార్టం: భూతవైద్యుడి దెబ్బలతోనే అనే అనుమానం.. కానీ
కర్నూలు జిల్లా మద్దికెర మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనుమానాస్పద స్ధితిలో చనిపోయిన నరేష్ మృతదేహానికి పోలీసులు రీ పోస్టుమార్టం చేశారు. భూత వైద్యుడు కొట్టిన దెబ్బల వల్లే అతను మరణించాడనే ఆరోపణలు రావటంతో పోలీసులు శవాన్ని వెలికి తీశారు. అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. కానీ అస్వస్థతతో చనిపోయాడని నిర్ధారణ జరిగింది. మృతుడి తండ్రి కూడా అనారోగ్యంతో చనిపోయాడని ఫిర్యాదు చేశారు.

భూతవైద్యుడి వద్దకెళ్లడంతో..
మద్దికెర మండలం పెరవలికి చెందిన వెంకటరాముడు, ఈశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. నరేష్ డిగ్రీ వరకు చదివి గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్తుంటాడు. జూన్ 1వ తేదీన మూర్ఛ రావడంతో అస్వస్ధతకు గురి అయ్యాడు. తల్లితండ్రులు స్ధానికంగా ఉన్న భూతవైద్యుడి వద్దకు తీసుకువెళ్ళారు.

సృహ కోల్పోవడంతో..
భూత వైద్యుడి వద్ద ఉండగా స్పృహ కోల్పోయిన నరేష్‌ను కుటుంబ సభ్యులు కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ 3 రోజులు చికిత్స పొందిన తర్వాత ఆదివారం నరేష్ మరణించాడు. వారి కుటుంబ పరిస్ధితి బాగోలేక పోవటంతో మిత్రులే డబ్బులు పోగుచేసి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే గ్రామస్తులు భూతవైద్యుడు కొట్టిన దెబ్బలకు చనిపోయాడని ఆరోపించటంతో పోలీసులు రీ పోస్టు మార్టం నిర్వహించారు.

పంచనామా
వీఆర్వో ఫిర్యాదు తీసుకున్న సీఐ నారాయణ రెడ్డి శవాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. ఎవరినీ కొట్టమని... మంత్రం వేశామే తప్ప, కొట్టలేదని పోలీసు విచారణలో భూతవైద్యుడు వెల్లడించాడు. కుమారుడు గతంలోనే రెండు మూడు సార్లు ఆస్పత్రికి వెళ్ళివచ్చాడని మృతుడి తండ్రి పోలీసులకు వివరించాడు.
ఈ నెల 2 నుంచి 5వ తేదీ వరకు కర్నూలు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడని...కుమారుడు అనారోగ్యంతోనే మరణించాడని తండ్రి వెంకట రాముడు పోలీసులకు తెలిపారు. మృతుడి తండ్రి వాంగ్మూలం కూడా తీసుకున్నామని, పంచనామా రిపోర్టు వచ్చిన తరువాత తగు చర్యలు తీసుకుంటామని మద్దికెర ఎస్సై తెలిపారు.దీంతో అతను అనారోగ్యంతో చనిపోయాడని నిర్ధారణ జరిగింది.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications