Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నల్లమలలో నరబలి..!! క్షుద్ర శక్తుల కోసమా..? గుప్త నిధుల కోసమా..?

ఆధునిక ప్రపంచంలో కూడా మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారా ? ఫలితంగా గుప్త నిధుల పేరుతో సాటి మనుషులనే బలిస్తున్నారా? అంటే కొన్ని ఘటనలు అవును అనే చెప్తున్నాయి. ఆధునిక యుగంలో కూడా మూఢ నమ్మకాల పేరుతో దారుణాలు పెరుగుతున్నాయన్న వార్తలు అందరినీ ఆలోచించేలా చేస్తున్నాయి . కర్నూలు జిల్లాలో చాలా కాలంగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుందని గుప్త నిధుల కోసమే ఒక నిండు ప్రాణాన్ని తీశారని ప్రచారం జరుగుతుంది.

గుప్త నిధుల కోసం ఓ యువకుడిని బలిచ్చారని ప్రచారం .. ఆలయ సమీపంలో తల ,మొండెం వేరు చేసి హత్య

గుప్త నిధుల కోసం ఓ యువకుడిని బలిచ్చారని ప్రచారం .. ఆలయ సమీపంలో తల ,మొండెం వేరు చేసి హత్య

గుప్త నిధుల కోసం ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు నరబలి ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. కర్నూలు జిల్లా సిరివేళ్ల సమీపంలోని నరసింహ స్వామి దేవాలయం సమీపంలో ఒక యువకుడి శవం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆ యువకుడిని దారుణంగా తల ,మొండెం వేరు చేసి హత్య చేశారు. ఆ యువకుడి దేహం , తల రెండూ వేరు చేయబడి వేర్వేరుగా పడి ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు . దీంతో గుప్త నిధుల కోసమే నరబలి ఇచ్చి ఉంటారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థుల సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

 యువకుడి వివరాల కోసం ఆరా తీస్తున్న పోలీసులు .. గుప్త నిధుల కోసమే దారుణం చేశారా ?

యువకుడి వివరాల కోసం ఆరా తీస్తున్న పోలీసులు .. గుప్త నిధుల కోసమే దారుణం చేశారా ?

సంఘటనా స్థలంలో యువకుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. గుప్త నిధుల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారా? లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంతకీ ఆ యువకుడు ఎవరో తెలిస్తే గానీ ఈ కేసును ఛేదించే అవకాశం లేదు . అందుకే క్లూస్ టీం , డాగ్ స్క్వాడ్ లతో సంఘటనా స్థలంలో అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు .

కర్నూలులో నేటికీ కొనసాగుతున్న గుప్త నిధుల వేట

కర్నూలులో నేటికీ కొనసాగుతున్న గుప్త నిధుల వేట

గతంలో రాయల కాలం నాటి చెన్నంపల్లి కోటలో బంగారం, వజ్రాల నిక్షేపాలున్నట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంతో తవ్వకాలకు అనుమతినిచ్చింది. దీంతో పురావస్తు, మైనింగ్, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అప్పట్లో పెద్దఎత్తున తవ్వకాలు జరిగాయి. వజ్ర వైఢ్యూర్యాలు, బంగారాన్ని ఈ కోట లోపల దాచి, దానిపై సీసం పోశారని స్థానికులు నమ్ముతారు. ఇక్కడ భారీ వర్షాలు కురిసిన సమయంలో వజ్రాల కోసం వేట సాగిచండం, కొంత మందికి వజ్రాలు దొరికియాని వార్తలు రావడం తెలిసిందే. అనేకసార్లు ఇక్కడ అక్రమ తవ్వకాలు కూడా జరిగాయి.ప్రస్తుతం కూడా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇలా గుప్త నిధుల కోసం జరుగుతున్న వేటలో నరబలులు జరుగుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+