మహబూబ్‌నగర్‌లో ఆటోను ఢీకొన్న లారీ, 14మంది మృతి..

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంబవించింది.మిడ్జిల్‌ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 14 మంది మృత్యువాతపడగా, 12మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందారు. కాగా ప్రమాదం సంభవించిన సమయంలో డ్రైవర్‌తోపాటు 15 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా మొత్తం ప్రయాణికుల్లో డ్రైవర్ మాత్రం బతికి బయట పడ్డాడు.

కాగ మండలంలోని కోత్తపల్లి, భోగ్యా తండాకు చెందిన కూలీలు వ్యవసాయ పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అధిక లోడ్‌తో ఆటో రావడంతో ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ఆటోను లారీ ఢికోట్టడడంతో ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. దీంతో ఆటోలో ఉన్న వారు చెల్లచెదురుగా పడిపోయారు.

accident

గతంలోనూ ఇదే ప్రాంతంలో పలు ప్రమాదాలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కొత్తపల్లి వాసులు ప్రమాద స్థలిలో ధర్నాకు దిగారు. జడ్చర్ల నుంచి కల్వకుర్తి వెళ్లే రహదారిపై బైఠాయించారు. కొత్తపల్లి వద్ద రోడ్డు సరిగా లేని కారణంగానే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+