సంక్షేమమే అభివృద్ది మంత్ర.. విపక్షాలపై మంత్రి కేటీఆర్ విసుర్లు..
ఇటీవల టీఆర్ఎస్ నేతలు కూడా ఎదురుదాడి చేస్తున్నారు. విపక్షాలకు ధీటుగా స్పందిస్తున్నారు. కౌంటర్ ఇవ్వడంలో మంత్రి కేటీఆర్ ముందు వరసలో నిలుస్తున్నారు. అరవై ఏండ్లలో ఎంతో మంది సీఎంలు వచ్చి తెలంగాణ కోసం చేసిందేమి లేదన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం.. అభివృద్ధి, సంక్షేమం దిశగా దూసుకుపోతోందని కేటీఆర్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడ్గల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించారు.
40 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ పల్లెల్లోనైనా.. ఎక్కడైనా.. తెలంగాణ వంటి అభివృద్ధి జరిగింది.. జరుగుతుందన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలోని ఏ రాష్ట్రంలో ఇంత త్వరగా అభివృద్ధి పనులు జరగలేదని అన్నారు.

పించన్ ఇచ్చి వృద్ధుల గౌరవాన్ని సీఎం కేసీఆర్ పెంచారని.. ఆడపిల్లల పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చి తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడారని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కిట్ల వల్లే ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు పెరిగాయని మంత్రి తెలిపారు. మొన్న బడ్జెట్ తర్వాత సీఎం కేసీఆర్ ఆవేదనతో.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని అడిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదన్నారు.
Recommended Video
కేంద్ర ప్రభుత్వం కలసి వచ్చినా రాక పోయినా.. మీ ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వము వెనకడుగు వేయలేదు.. వేయదని అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ గురించి పార్లమెంట్ లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు..మిషన్ భగీరథ వల్ల ఇక నల్గొండలో ఫ్లోరోసిస్ రాదని కేంద్ర పెద్దలే జవాబు చెప్పరాని..అటువంటి ముందుచూపు పాలన సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని కేటీఆర్ కామెంట్ చేశారు. త్వరలో దుందుభి నదిపై చెక్ డ్యామ్ కట్టిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications