పెట్రో వాత: ధరల పెంపును నిరసిస్తూ బైక్‌కు నిప్పు..
పెట్రో ధరలు చుక్కలను అంటుతున్నాయి. రూ.100 మార్క్ ఎప్పుడో దాటేసింది. డీజిల్ ధర కూడా అలానే ఉంటుంది. దీంతో సామాన్యుడి నడ్డి విరుగుతుంది. ఏ చిన్న పనికి అయినా.. ఎలా వెళ్లాలని అంటున్నారు. పెట్రో ధరలపై అక్కడ అక్కడ నిరసనలు కూడా వస్తున్నాయి. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో ఒకతను తన ఆగ్రహాన్ని వెలిబుచ్చాడు.
పెట్రోల్ ధరలతో విసుగెత్తిపోయిన ఓ వ్యక్తి తన వాహనానికి నిప్పంటించి దహనం చేశాడు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండల కేంద్రానికి చెందిన కుర్వ ఆంజనేయులు బుధవారం మధ్యాహ్నం స్థానిక వైఎస్‌ఆర్ చౌరస్తాలో అకస్మాత్తుగా తన ద్విచక్ర వాహనానికి నిప్పంటించాడు. స్థానికులు గమనించి ద్విచక్ర వాహనంపై నీరుపోసి మంటలను ఆర్పారు. తాను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, పెట్రోల్ అధిక ధరలు పెనుభారంగా మారాయని ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశాడు. మోటారు సైకిల్‌కు పెట్రోల్ పోయించలేని స్థితిలో విసుగు చెంది దహనం చేసినట్లు చెప్పాడు.

అతను అలా చేసి ఉండొచ్చు.. కానీ నిజానికి పరిస్థితి అలానే ఉంది. లీటర్ పెట్రోల్ రూ.100 కన్నా ఎక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరిగిందని చెప్పి.. ధరలను పెంచుతున్నారు. మరీ వేతనాల సంగతి ఏంటీ అని జనం అడుగుతున్నారు. జీతం పెంచారా అని ప్రశ్నిస్తున్నారు. కరోనా వైరస్ పేరు చెప్పి ఉద్యోగాలు కూడా తీసి వేసే పరిస్తితి ఉందని వివరించారు. మరీ అలాంటి సమయంలో పెట్రో ధరలను పెంచడం ఎంతవరకు భావ్యం అని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications