నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది: బండి సంజయ్
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మెదక్ జిల్లాలో కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని గుర్తుచేశారు. కానీ వాటిని దక్కనీయకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రంగంపేటలో బహిరంగసభలో ప్రసంగించారు. అంతకుముందు కుమ్మరులు, రైతుల కష్టాలను బండి సంజయ్ తెలుసుకున్నారు. యాత్రలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఫైరయ్యారు.

కేసీఆర్ పాలనపై బండి సంజయ్ విమర్శలు చేశారు. సరైన సమయంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదన్నారు. దీంతో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. వారి చావులకు సీఎం కేసీఆర్ కారణం అని చెప్పారు. తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల కోసం అని చెప్పారు. అలాంటి కీలకమైన నియామకాల అంశాన్ని కేసీఆర్ సర్కార్ మరచిపోయిందని దుయ్యబట్టారు. మరోవైపు బండి సంజయ్ పాదయాత్ర అంతకుముందు రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఒకసారి అనివార్య కారణం కాగా.. మరోసారి కల్యాణ్ సింగ్ మృతితో వాయిదా పడింది. ఇటు ఈటల రాజేందర్ కూడా పాదయాత్ర చేశారు. మిగతా పార్టీ నేతలు కూడా పాదయాత్ర బాట పట్టబోతున్నారు. ఎన్నికలకు ముందు పాదయత్ర ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తారు. తేదీ ఇంకా కన్ఫామ్ కాలేదు.
Recommended Video
ఇటు బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. 'ప్రజా జీవన యాత్ర' పేరుతో హుజూరాబాద్ నియోజకవర్గంలో గల కమలాపూర్ మండలం బత్తినవారిపల్లి నుంచి ప్రారంభం అయ్యింది. నియోజకవర్గంలో వివిధ గ్రామాల మీదుగా 23 రోజుల పాటు ఈటల పాదయాత్ర చేయాల్సి ఉంది. మొత్తం 107 గ్రామపంచాయితీల పరిధిలోని 127 గ్రామాల్లో.. 270 కిలోమీటర్లు ఈటల రాజేందర్ పాదయాత్ర చేయాలి.. కానీ అస్వస్థత కారణంగా పాదయాత్రకు మధ్యలోనే బ్రేక్ పడింది. మరోవైపు మోకాలికి ఆపరేషన్ జరిగింది. దీంతో వైద్యులు పాదయాత్ర చేయొద్దని సూచించారు. దీంతో ఆయన పాదయాత్రకు శాశ్వతంగా బ్రేక్ పడినట్టే అవుతుంది.












Click it and Unblock the Notifications