నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ పనైపోయింది .. వారికి మతి భ్రమించిందన్న గుత్తా
తెలంగాణా రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ హవా కొనసాగుతుంది అని టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి సోదరుల శకం ముగిసిపోయిందని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు . స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమని చెప్పారు.

విపరీతమైన ఓవర్ కాన్ఫిడెన్స్ తో , పిచ్చి పనులతో కోమటిరెడ్డి సోదరులు వారికి వారే ఓటమిని కొనితెచ్చుకుంటున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వారికి మతి భ్రమించింది అని వ్యాఖ్య చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి అహంకారానికి చెంపపెట్టులాంటి తీర్పు వస్తుందని ఆయన చెప్పారు. భువనగిరి పార్లమెంటు స్థానంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లక్ష ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోనున్నారని గుత్తా జోస్యం చెప్పారు. నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమర్ రెడ్డి, జానారెడ్డిల పని అయిపోయిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మిని కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దింపారు. ఈ నేపధ్యంలోనే గుత్తా ఈ వ్యాఖ్యలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఖాయం అని కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి పేర్కొన్నారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications